ఈసారి యుద్ధం జరిగితే భారత్‌ తట్టుకోలేదు!

Pakistan’s War Threats to India After Operation Sindhoor

‘ఆపరేషన్ సింధూర్’ని అడ్డుకోలేక అమెరికా సాయంతో పాక్ బయటపడింది. కానీ కుక్క తోక వంకర ఎన్నటికీ సరికాదన్నట్లు, నాలుగు నెలలు గడిచేసరికి పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా అసీఫ్ మళ్ళీ ప్రేలాపనలు మొదలుపెట్టేశారు.

పాక్ న్యూస్ ఛానల్‌ ‘సమా’కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “నాడు ఔరంగజేబ్ కాలం నుంచి నేటి వరకు భారత్‌ ఎన్నడూ ఒక్క దేశంగా ఐక్యంగా లేదు. కానీ భారత్‌ నుంచి విడిపోయినప్పటి నుంచి పాకిస్తాన్‌ ఒక్కటిగానే నిలిచి ఉంది.

ADVERTISEMENT

భారత్‌తో ఉద్రిక్తతలు, యుద్ధం వద్దనే మేము కోరుకుంటాము. మళ్ళీ ఇరుదేశాల మద్య మరోసారి యుద్ధం జరిగే అవకాశాలు తోసిపుచ్చలేము. ఇప్పుడు మాకు అండగా అనేక దేశాలున్నాయి. ఈసారి యుద్ధం జరిగితే మా ధాటిని భారత్‌ తట్టుకోలేదు,” అని అన్నారు.

భారత్‌లో అనేక భాషలు, భిన్న సంస్కృతీ సంప్రదాయాలు ఉన్నప్పటికీ ఏ రాష్ట్రమూ విడిపోవాలనుకోవడం లేదు. కాశ్మీర్‌ని విడగొట్టాలని పాక్ ఎన్ని కుట్రలు చేసినప్పటికీ ఫలించలేదు.

కానీ భారత్‌ నుంచి పాక్ విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించిన తర్వాత దాని నుంచి బంగ్లాదేశ్ విడిపోయింది. బలూచిస్తాన్, ఆక్రమిత కశ్మీర్ ప్రజలు కూడా పాక్ నుంచి విడిపోవాలని పోరాటాలు చేస్తునే ఉన్నారు.

ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ ప్రజలందరూ, అలాగే రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ముక్త కంఠంతో కేంద్రానికి సంఘీభావం తెలిపారు. భారత్‌ ఐఖ్యతకు ఇంతకంటే చక్కటి నిదర్శనం ఏముంటుంది?

ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడే పాకిస్తాన్‌కి అండగా చైనా, టర్కీ, పరోక్షంగా అమెరికా నిలబడ్డాయి. అయినా భారత్‌ని పాక్ ఎదుర్కోలేకపోయింది. దాంతో ట్రంప్‌ సాయంతో యుద్ధం నుంచి బయటపడాల్సి వచ్చింది.

పాక్ పరిస్థితి నేటికీ అలాగే ఉంది. పైగా భారత్‌ దాడులలో అనేక యుద్ధవిమానాలతో పాటు కీలక వైమానిక స్థావరాలు కూడా కోల్పోయింది. అయినా పాక్ మంత్రుల ప్రగల్భాలు తగ్గలేదు. మళ్ళీ యుద్ధమే కోరుకుంటున్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అంటే ఇదేనేమో?

ADVERTISEMENT
Latest Stories