Prabhas Marriage Dateటాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ గా గత కొన్ని ఏళ్లుగా ప్రభాసే నెంబర్ వన్ ప్లేస్ లోనే కొనసాగుతున్నాడు. దాంతో ఎప్పటికప్పుడు జనం నోళ్ళలో ప్రభాస్ పెళ్లి వ్యవహారం నిత్యం నానుతూనే ఉంది. పైగా ప్రభాస్ ఇప్పుడు వరుస పాన్‌ ఇండియా సినిమాల హీరో. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాల బడ్జెట్‌ లెక్క వేస్తే.. రూ.1000 కోట్లకు పైమాటే. మరి వేయి కోట్ల హీరోకి పెళ్లి ఎప్పుడు అవుతుందనేది ఎవరికీ అయినా ఇంట్రెస్టింగ్ విషయమే కదా.

అయితే, ప్రముఖ జ్యోతిషుడు ఆచార్య వినోద్‌ కుమార్‌ ప్రభాస్ కి పెళ్లి ఎప్పుడు అవుతుందో చెప్పుకొచ్చాడు. ప్రభాస్‌ కి ఈ ఏడాది పెళ్లి అయిపోతుంది అని ఆచార్య వినోద్‌ కుమార్‌ బల్లగుద్ది మరీ జ్యోతిషయం చెప్పాడు. ఆయన మాటల్లోనే “హీరో ప్రభాస్‌ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ ఏడాది అక్టోబరు నుంచి వచ్చే ఏడాది అక్టోబరు మధ్యలో ప్రభాస్ పెళ్లి ఎప్పుడైనా జరగొచ్చు.

నేను చెప్పింది నిజం.. మన పాన్‌ ఇండియా స్టార్‌ విషయంలో నా జ్యోతిష్యం నిజం అవుతుంది’ అంటూ ఆచార్య వినోద్‌ కుమార్‌ స్పష్టం చేశాడు. మరి వినోద్‌ కుమార్‌ చెప్పినట్లే ప్రభాస్‌ పెళ్లి నిజంగానే ఆయన చెప్పిన తేదీల మధ్యలో జరుగుతుందా ? జరిగితే మాత్రం.. ఆచార్య వినోద్‌ కుమార్‌ దీన్ని బాగా పబ్లిసిటీ చేసుకుని ఇంకాస్త ఫేమ్ అవుతాడు.

మొత్తానికి ప్రభాస్ పెళ్లి జ్యోతిషులకు కూడా ముందుస్తు పెట్టుబడి అయిపోయింది. ఇక రాధేశ్యామ్‌ ముంబై ప్రీరిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మీ పర్సనల్ లైఫ్‌ లో లవ్ మ్యాటర్ లో ఎప్పుడైనా మీ ప్రిడిక్షన్ తప్పు అయ్యిందా` అని సదరు జర్నలిస్ట్ అడగగా..

ప్రభాస్ సమాధానమిస్తూ.. ‘అయ్యింది, చాలాసార్లు. అందుకేగా నాకింకా పెళ్లి కాలేదు` అని కామెంట్స్ చేశాడు. ఈ కామెంట్స్ ను బట్టి ప్రభాస్ కి కూడా లవ్ ఫెయిల్యూర్ ఉంది అని అర్ధం అవుతుంది.