సిఎంల ప్రమాణ స్వీకారాలపై బీఆర్ఎస్‌, టీఆర్ఎస్‌ మౌనం!

KCR, KTR, Kavitha Silence Sparks Fresh Political Debate

నాలుగు రాష్ట్రాలలు, పుదుచ్చేరిలో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటఅవుతున్నాయి. కొత్త ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారాలు చేస్తున్నారు. కనుక ఏపీ, తెలంగాణతో సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష పార్టీల అధినేతలు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇటువంటి సందర్భాలలో పార్టీలకు రాజకీయాలకు అతీతం శుభాకాంక్షలు తెలపడం సత్సాంప్రదాయాన్ని ప్రధాని మోడీతో సహా అందరూ పాటిస్తున్నారు.

ADVERTISEMENT

తమిళనాడులో బిజేపిని అడ్డుకునేందుకు పావులు కదిపి కాంగ్రెస్‌, వామపక్షాలతో పొత్తులు పెట్టుకొని నేడు సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్‌కి ప్రధాని మోడీ సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు.

కానీ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలని టీఆర్ఎస్‌ పేరుని బీఆర్ఎస్‌ పార్టీగా మార్చుకున్న కేసీఆర్‌ ఆ జాతీయ స్పూర్తి చూపలేదు. కేసీఆర్‌, కేటీఆర్‌ కొత్త ముఖ్యమంత్రులకు శుభాకాంక్షలు తెలుపలేదు. ఎందుకంటే వారందరూ కాంగ్రెస్‌, బిజేపిలకు చెందినవారు లేదా ఆ పార్టీలతో కలిసి ఉన్నారు కనుక.

కానీ కేసీఆర్‌ జాతీయ కలలు కంటూ ప్రత్యేక విమానం వేసుకొని పశ్చిమ బెంగాల్, తమిళనాడుతో పలు రాష్ట్రాలలో పర్యటించినప్పుడు స్టాలిన్, మమతా బెనర్జీ తదితరులు కాంగ్రెస్‌ పార్టీతోనే ఉన్నారు. అప్పుడు కేసీఆర్‌కి అభ్యంతరం అనిపించలేదు. ఎందుకంటే ప్రధాన మంత్రి కావాలనే తన కల నెరవేర్చుకోవడానికి వారు సాయపడతారని కేసీఆర్‌ భావించడమే కారణం.

ఇప్పుడు గెలిచి ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపడుతున్నవారినీ అభినందించలేదు. కనీసం మిత్రధర్మం పాటించి ఓడిన మమతా బెనర్జీ, స్టాలిన్ తదితరులను ఫోన్ చేసి ఓదార్చలేదు!

జాతీయస్థాయి రాజకీయ నాయకుడుగా ఎదగాలనుకుంటే ఆ స్థాయిలోనే మాట్లాడాలి. వ్యవహరించాలి కదా? ఏపీ, తెలంగాణ సిఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి అలాగే వ్యవహరిస్తున్నారు కదా?

టీఆర్ఎస్‌ పార్టీ పెట్టుకొని తెలంగాణ ముఖ్యమంత్రి అవుదామని ఆశ పడుతున్న కల్వకుంట్ల కవిత కూడా ఎవరినీ అభినందించలేదు. ఒకవేళ రేపు ఆమె లేదా కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయితే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇలాగే మౌనంగా ఉండిపోతే?

ADVERTISEMENT
Latest Stories