హీరోయిన్ ను కరిచిన వీధి కుక్కలు!

parul yadav biten by street dogsసెలబ్రిటీలు ఎంత జంతు ప్రేమికులో సోషల్ మీడియాలోని వారి ఎకౌంటులను పరిశీలిస్తేనే అర్ధమవుతుంది. ముఖ్యంగా విశ్వాసానికి మారుపేరైన కుక్కల విషయంలో ఈ ముద్దుగుమ్మలు మరింత ప్రీతిపాత్రంగా ఉంటారు. అలాంటి జాబితాలో కన్నడ హీరోయిన్ పరుల్ యాదవ్ కూడా ఉంది. తన పెంపుడు కుక్కను తీసుకుని ముంబైలోని జోగేశ్వర్ రోడ్ లో వాకింగ్ కు వెళ్ళిన పరుల్ యాదవ్ కు స్థానికంగా ఉన్న వీధి కుక్కలు షాక్ ఇచ్చాయి.

తన పెంపుడు కుక్కపై విరుచుకుపడుతున్న తరుణంలో వాటిని తరిమికొట్టేందుకు ప్రయత్నించగా, ఆ వీధి కుక్కలు కాస్త పరుల్ ను టార్గెట్ చేసుకున్నాయి. దీంతో మూకుమ్మడిగా దాడి చేయడంతో, పరుల్ తల, చేతులు, కాళ్ళపై తీవ్రంగా గాయాలైనట్లు సమాచారం. ఆ సమయంలో అక్కడే ఉన్న పారుల్ సోదరి శీతల్, స్థానికుల సాయంతో ఆమెను రక్షించి దగ్గర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. సోమవారం నాడు సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories