రాజకీయంగా జగన్ పార్టీ సిద్ధాంతాలకు ‘జనసేన’ వ్యతిరేకం అన్న విషయం తెలిసిందే. పొలిటికల్ ప్రసంగాలలో ఎక్కడా జగన్ ను గానీ, ఆ పార్టీ నాయకులను గానీ పవన్ ప్రసంగించిన సందర్భాలు లేవు. అయితే ఆయా నాయకుల వ్యక్తిగత కార్యక్రమాల్లో మాత్రం పవన్ తప్పనిసరిగా హాజరు కావడం గమనించదగ్గ అంశం.
తాజాగా అంబటి రాంబాబు కుమార్తె వివాహ మహోత్సవానికి గుంటూరు విచ్చేసారు పవన్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వెబ్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పవన్ ఎక్కడికి వచ్చినా ఏం జరుగుతుందో… ఇక్కడ కూడా అదే జరిగింది. క్లీన్ షేవ్ తో పవన్ ను చూసిన అభిమానులు యధావిధిగా పవన్ నినాదం చేసారు. పవన్ రాకతో అంబటి రాంబాబు కుమార్తె వివాహం కోలాహలంగా జరిగింది. ఈ వేడుకకు వైసీపే అధినేత జగన్ కూడా హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ADVERTISEMENT
ADVERTISEMENT



