పవన్ కళ్యాణ్ ‘గెస్ట్ రోల్’ ప్రచారం! నిజమేనా?

Pawan kalyan disappints his fansఅగ్ర హీరోలు పలు సినిమాలలో అతిథి పాత్రలు చేస్తున్నారంటూ కొన్ని వార్తలు ఎప్పుడూ హల్చల్ చేస్తుంటాయి. అయితే అవి ఎంత వరకు వాస్తవాలనేది ఆయా సినిమాలు విడుదలయ్యే వరకు తెలియదు. ఈ ఏడాది విడుదలైన ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ చిత్రంలో మహేష్ ఓ అతిథి పాత్ర చేసున్నారంటూ సోషల్ మీడియా చేసిన సందడి తెలిసిందే. మహేష్ బావ సుధీర్ బాబు హీరో ఈ చిత్ర హీరో కావడంతో ఈ పుకార్లు పుట్టుకొచ్చాయని సినిమా విడుదలైన తర్వాత అందరికీ స్పష్టమైంది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయంలో ఓ సమాచారం సందడి చేస్తోంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ – పవన్ కళ్యాణ్ ల సాన్నిహిత్యం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈ అనుబంధంతోనే ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న “అ… ఆ…” సినిమాలో పవన్ ఓ అతిథి పాత్ర చేయబోతున్నారంటూ ట్రేడ్ వర్గాలలో బలంగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న నితిన్ కూడా పవన్ కు వీరాభిమాని కావడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. ఈ విషయమై పవన్ – త్రివిక్రమ్ ల మధ్య ఇప్పటికే చర్చ జరిగిందని, పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఈ సమాచారం సారాంశం.

ADVERTISEMENT

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన “అ… ఆ…”ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోందట. ఒకవేళ పవన్ నటిస్తున్న విషయం నిజమైతే నితిన్ పంట పండినట్లే కదా!

ADVERTISEMENT
Latest Stories