రాజకీయాలలో కులం అనేది చాలా కీలక భూమిక పోషిస్తుంది. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా అది అక్షరసత్యం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అది కొంత ఎక్కువనే చెప్పాలి. కాబట్టి కులాల వారీగా రాజకీయ పార్టీలు పథకాలు ప్రకటిస్తూ ఉంటవి. పార్టీల అధినేతల బట్టి, ఆ పార్టీ మూలాలని బట్టి, ఆ పార్టీలో అత్యధిక నాయకులను బట్టి ఒక్కో కులం ఒక్కో పార్టీని సమర్థిస్తుంది. పార్టీలు ఏ కులాన్ని పూర్తిగా విస్మరించకపోయినా కొంత మేర వారి కులాలకు కొంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు.
[m9ad]
టీడీపీలో కమ్మ కులస్తులకు ఎక్కువ టిక్కెట్లు వస్తుంటవి. కాంగ్రెస్, వైఎస్సాఆర్ కాంగ్రెస్ లలో రెడ్లకు ఎక్కువ సీట్లు వస్తాయి. అయితే తనకు కులం లేదు అంటూ ఉంటారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జనసేన పార్టీలో ముఖ్యమైన స్థానాలలో కాపులే ఎక్కువ. ఇటీవలే కాలంలో ఆయన పార్టీలో జాయిన్ అవుతున్న వారిలో కూడా ఆ కులస్తులే ఎక్కువ. అయినా పవన్ కళ్యాణ్ తనకు కులం లేదు అంటూ ఉంటారు. పైగా ఎవరైనా తనకు కులం అంటిస్తే వారి పని పడతా అని బెదిరిస్తూ ఉంటారు కూడా.
పవన్ కళ్యాణ్ ఎవరినైనా టార్గెట్ చేస్తే ఆయనకు ఉన్న సినిమా ఇమేజ్ వల్ల మీడియా ఎక్కువగా కవరేజ్ ఇస్తుంది. దానికి బయపడి నాయకులు కూడా పెద్దగా ఇటువంటి పాయింట్స్ టచ్ చెయ్యరు. గతంలో హెల్ప్ చేశాడనే కారణంగా కొంత మేర టీడీపీ వారు ఆయనను ఏమీ అనలేకపోతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ కులాల వారీగా, మతాల వారీగా సభలు పెడుతూ ఉంటారు. ముస్లింలకు కలిసినప్పుడు టోపీ పెట్టుకోవడం, క్రైస్తవుల మీటింగులో మేరీ మాత గురించి మాట్లాడటం గూగుల్ లో వెతికితే మనకు మిగతా రాజకీయ నాయకులు కూడా చేసేది అనే అనిపిస్తుంది. కులాల వారీగా ఇది చేస్తా అది చేస్తా అని చెప్తారు. ఇదేమి కొత్తగా చేసేది కాదు అన్ని పార్టీలు ఇవే పనులు చేస్తాయి.
కాకపోతే వారికి పవన్ కళ్యాణ్ కులం రంగు పూస్తారు. ఆయనను అలా అంటే ఊరుకోను అంటారు. నేను రెల్లి కులం తీసుకున్నాను అంటూ ప్రకటించారు మొన్న ఆ మధ్య ఆయన. గతంలో చంద్రబాబు తనని తాను పెద్ద మాదిగ అని చెప్పుకునే వారు. కుల నిర్మూలనవైపుగా పవన్ కళ్యాణ్ కొత్తగా చేస్తున్నది ఏమీ లేదు. పై పెచ్చు తనకు కులం లేదంటూనే పాత పద్ధతులే పాటిస్తున్నారు కూడా. ఆయనను సమర్ధించే మెజారిటీ యువత రాజకీయాలకు కొంత కొత్త కాబట్టి ఆయన చేస్తున్నవి విప్లవాత్మకం అనుకోవచ్చు. కాకపోతే ఈ ఫీట్లు అన్నీ గతంలో అన్ని పార్టీల వారు చేసినవే.



