నిర్మలా సీతారామన్ పై పవన్ వ్యాఖ్యలు అనుచితమా?

Pawan Kalyan Comments on Nirmala Sitharamanజనసేన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ కాసేపటి క్రితం ఉభయ గోదావరి జిల్లాల పార్టీ కార్యకర్తలని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా అప్పట్లో ప్రజారాజ్యం పార్టీని వదిలి పార్టీ నాయకత్వంపై విరుచుకుపడిన పరకాల ప్రభాకర్ పై నిప్పులు చెరిగారు పవన్ కళ్యాణ్.

పరకాల ప్రభాకర్‌లా కమిట్‌మెంట్ లేని వ్యక్తులు జనసేనలో ఉండొద్దు, పార్టీలో గుర్తింపు ఇవ్వడం లేదన్న వ్యక్తి ప్రత్యేక హోదా ఇవ్వకున్నా, తన సతీమణిని కేంద్ర కేబినెట్‌లో కొనసాగిస్తున్నారు అని వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్. పరకాల ప్రభాకర్ శ్రీమతి నిర్మల సీతారామన్ కేంద్ర రక్షా మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే.

ADVERTISEMENT

అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సరికావని అంతా అంటున్నారు. “నిర్మల సీతారామన్ గారు సవశక్తితో ఈ స్థాయికి వచ్చిన మహిళ. ఆమె ఈ స్థాయికి వచ్చింది పరకాల వల్ల కాదు. ఆమె భవిష్యత్తును ఆమె భర్త నిర్ణయించాలి అనడం తప్పు. మహిళలు భర్త చాటునే ఉండాలి అనేలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు,” అని చాలా మంది అంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories