చంద్రబాబుతో సహా అందరికీ ఒకే కౌంటర్ ఇచ్చిన పవన్!

pawan-kalyan-chandrababu-naidu-side-businessఓ పక్కన సినిమాలు చేస్తూ… మరో పక్కన రాజకీయాలు మాట్లాడుతున్న ‘జనసేన’ అధినేతపై ఉన్న రాజకీయ విమర్శలు కోకొల్లలు. అందులో ప్రధానమైనది… ‘పార్ట్ టైం పొలిటిషియన్’ అన్న మాట. అధికార, ప్రతిపక్ష సభ్యులతో సహా చాలా మంది చాలా సందర్భాలలో పవన్ పై చేసిన విమర్శ ఇది. నిజానికి ‘జనసేన’ స్థాపించిన నాటి నుండి ఇప్పటివరకు పవన్ పై ఎక్కువ సార్లు వ్యక్తమైన విమర్శ కూడా ఇదేనని చెప్పవచ్చు. మరి తాజాగా ఈ విమర్శకు పవన్ ఏమని సమాధానం ఇచ్చారు? అంటే…

ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా ప్రస్తుత నేతలంతా పార్ట్ టైం పొలిటిషియన్లేనని, చంద్రబాబు గారికి వ్యాపారాలు లేవా? సుజనా చౌదరికి, టీజీ వెంకటేష్ కు… ఇలా అందరూ వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయాలు చేస్తున్నవారేనని… వీరంతా మహాత్మా గాంధీ, నెహ్రూల మాదిరి రాజకీయాల్లో ఉంటే, తనను విమర్శించడానికి సరిపోతారని… తనపై వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు పవన్. పేర్లు చెప్పకపోయినా అందరికీ ఇదే సూత్రం వర్తిస్తుందని, రోజా వంటి వారికి కూడా పవన్ చెప్పే సమాధానం ఇదేనంటూ అభిమాన వర్గం అంటోంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories