మంత్రులూ అగ్గిపుల్ల ఇస్తారా… చిచ్చు పెడతాము!

Pawan Kalyan and Home Minister Anitha Vangalapudi address DSP Jayasurya complaint in Andhra Pradesh.

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య సివిల్ పంచాయితీలలో తలదూరుస్తూ, పేకాట శిబిరాలు ప్రోత్సహిస్తున్నారని డెప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌కి పిర్యాదులు వచ్చాయి.

ఈ వ్యవహారాన్ని హోంమంత్రి, డీజీపీ దృష్టికి తీసుకు వెళ్ళాలని అధికారులను సూచించారు. జయసూర్య వ్యవహార శైలిపై ఎస్పీ విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పోలీస్ శాఖలో ఈవిదంగా జరుగుతుండటంపై పవన్‌ కళ్యాణ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ADVERTISEMENT

జయసూర్య వ్యవహారం, డెప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌ అసంతృప్తి వ్యక్తం చేయడంపై రాష్ట్ర హోంమంత్రి అనిత వంగలపూడి నిన్న మీడియా సమావేశం నిర్వహించి వివరణ ఇచ్చారు.

తన శాఖలో జరిగే ప్రతీ విషయమూ తన దృష్టికి వస్తుందని, ఈ వ్యవహారంలో డెప్యూటీ సిఎం హోదాలో పవన్‌ కళ్యాణ్‌ తనకు సలహా ఇవ్వడం తప్పుగా భావించడం లేదన్నారు. దీనిని తన శాఖలో జోక్యం చేసుకోవడంగా కాక, కూటమిలో మూడు పార్టీల మంత్రులు పరస్పర సమన్వయంతో పనిచేస్తున్నామని చెప్పడానికి ఇదో చక్కటి ఉదాహరణగా చూడాలన్నారు.

మాకూ మాకూ మద్య సత్సంబంధాలే ఉన్నాయి. పరస్పర అవగాహనా ఉంది. మేమందరం కలిసి మెలిసి పనిచేస్తుంటే మాకు లేని భేషజాలు మీకెందుకని ఆమె మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు.

ప్రతీ శాఖ మంత్రికి ఇతర శాఖలకు సంబంధించి ఏవో పిర్యాదులు వస్తూనే ఉంటాయని, వాటిని ఆయా శాఖల మంత్రుల దృష్టికి తీసుకువెళుతుంటామన్నారు. డెప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌ కూడా అలాగే చేశారని, కనుక దీనిని భూతద్దంలో నుంచి చూడాల్సిన అవసరం లేదన్నారు మంత్రి అనిత వంగలపూడి.

జయసూర్య వ్యవహారం డెప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌ వద్దకు వెళ్ళింది కనుకనే అయన స్పందించారు. ఒకవేళ సిఎం చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్ళి ఉంటే ఆయనే స్పందించేవారు. సరిగ్గా ఇలాగే స్పందించేవారని అందరికీ తెలుసు.

సిఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేసినా, హోంమంత్రి అనిత వంగలపూడికి నాలుగు చివాట్లు పెట్టినా ఎవరూ తప్పుగా భావించారు. ఎందుకంటే ఆయన సిఎం గనుక!

కానీ పవన్‌ కళ్యాణ్‌ స్పందిస్తే దానిని భూతద్దంలో నుంచి చూపిస్తూ, కూటమి ప్రభుత్వంలో జరగకూడనిదేదో జరిగిపోతోందన్నట్లు వైసీపీ, దాని మీడియా హడావుడి చేస్తుంటుంది. ఎందుకంటే, ఆయన జనసేన, ఆమె టీడీపికి చెందినవారు కనుక!

కానీ ఇటువంటి చిన్న చిన్న విషయాలను భూతద్దంలో పెద్దవి చేసి చూపిస్తూ కూటమి ప్రభుత్వంలో చిచ్చుపెట్టాలని కొందరు కుట్రలు చేస్తున్నారని, కానీ అవి ఎన్నటికీ ఫలించవని మంత్రి అనిత వంగలపూడి అన్నారు.

ADVERTISEMENT
Latest Stories