పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “అజ్ఞాతవాసి” వేడుకలో ఓ ఆసక్తికరమైన అంశం చోటు చేసుకుంది. పవన్ స్టేజ్ పైకి వచ్చినపుడు ఓ అభిమాని సెక్యూరిటీ నిబంధనలను తప్పించుకుని పవన్ వద్దకు వచ్చి, ఆయన కాళ్ళ మీద పడ్డాడు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన సెక్యూరిటీ సిబ్బంది సదరు అభిమానిని పట్టుకుని లాక్కెళ్ళబోయారు.
ఇక్కడ తనంటే ఏంటో మరోసారి తన ఫ్యాన్స్ కు రుచిచూపించారు పవర్ స్టార్. సదరు సెక్యూరిటీ సిబ్బందిని వారిస్తూ అతనిని విడిచిపెట్టమని చెప్తూ, సదరు అభిమానిని దగ్గరికి తీసుకుని ఓ సెల్ఫీ ఇచ్చి పంపించారు. దీంతో ఒక్కసారిగా ఆడిటోరియం ‘పవర్ స్టార్… పవర్ స్టార్…’ అన్న నినాదాలతో మారుమ్రోగిపోయింది.
ఒక విధంగా చప్పగా సాగిన ఆడియో వేడుకలో రియల్ హైలైట్ గా ఇదే నిలిచింది. ఇదే తరహా ఉదంతం ఐఐఎఫ్ఏ అవార్డుల వేడుకలో ‘చియాన్’ విక్రమ్ విషయంలో చోటు చేసుకోగా, విక్రమ్ కూడా ఇదే తరహాలో సదరు అభిమానికి సెల్ఫీ ఇచ్చి పంపించిన విషయం సినీ విజ్ఞులకు విదితమే.






