తన వద్ద డబ్బులు లేవని బహిరంగంగానే చెప్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కరెన్సీతో దొరికిపోవడం ఏంటి? అనుకుంటే పొరపాటే..! కరెన్సీని పరిశీలిస్తూ అయితే దొరికిపోయారని చెప్పవచ్చు. కొత్తగా వచ్చిన 2000 రూపాయల నోటును, పాత 100 రూపాయల నోటుతో పోల్చి చూస్తున్న పవన్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
ఏ విషయాన్ని అయినా సుదీర్ఘంగా పరిశీలించిన తర్వాత మాత్రమే మాట్లాడే ‘జనసేన’ అధినేత ఇప్పటివరకు బహిరంగంగా కరెన్సీ విషయంపై స్పందించింది లేదు. అనంతపురంలో విద్యార్ధులతో ఓ రెండు ముక్కలు ప్రస్తావించినప్పటికీ, అవి ప్రజలు పడుతున్న కష్టాలనే అడ్రస్ చేసారు. దీంతో తన నెక్స్ట్ టార్గెట్… ఈ కరెన్సీ నోట్లే అనుకుంటున్నారో ఏమో గానీ… తీక్షణగా చూస్తున్న పవన్ ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
ADVERTISEMENT
ADVERTISEMENT



