‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ భావజాలం ఎరుపు జెండా పార్టీల మాదిరిగా ఉంటోందన్న సంగతిని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వమే లక్ష్యంగా పవన్ ఉపన్యాసాలు ఇస్తుండడంతో, వామపక్ష పార్టీ సిద్ధాంతాల మాదిరి ప్రతి అంశంలో బిజెపిని టార్గెట్ చేస్తున్నారనేది బహిరంగమైన విషయం. అలాగే వామపక్షాలతో కలిసి పని చేసేందుకు పవన్ ఒకటి, రెండు సందర్భాలలో బహిరంగంగానే వ్యాఖ్యానించడంతో, ఇప్పుడవి కార్యరూపం దాలుస్తున్నాయి.
రాష్ట్రంలోని ప్రజల సమస్యల పరిష్కారానికి భవిష్యత్తులో పవన్ తో చేతులు కలుపుతామని సీపీఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి కె.రామకృష్ణ అధికారికంగా వెల్లడించారు. ప్రజాచైతన్య యాత్రలో భాగంగా విశాఖపట్టణం జిల్లాలోని నర్సీపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ… కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశాయని, ప్రత్యేక హోదా అంశంపై కేంద్రాన్ని నిలదీసే దమ్ము ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదని, పవన్ తో ఇప్పటికే చర్చలు జరిపామని, భవిష్యత్తులో ఆయనతో కలిసి ఉద్యమిస్తామని రామకృష్ణ స్పష్టం చేశారు.
అయితే వామపక్షాల భావజాలం ఎలా ఉన్నా, అధికారానికి మాత్రం వారు దూరం అన్న సంగతి తెలిసిందే. మరి అలాంటి పార్టీలతో కలుపుకుని ముందుకెళితే, పవన్ కు కూడా అదే పరిస్థితి ఎదురుకావచ్చు అన్నది విశ్లేషకుల అభిప్రాయం. బహుశా పవన్ కు కూడా అధికారం అవసరం లేదు గనుకే, వారి వెంట నడుస్తున్నారా? అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. దీని వలన పవన్ కు చేకూరే ప్రయోజనం ఏమైనా ఉంది అంటే… సంస్థాగతంగా చాలా వీక్ గా ఉన్న ‘జనసేన’కు కొంతమేర క్యాడర్ లభించే అవకాశం ఉంది.
Win Rs.1000 Paytm for closest guess of @NameisNani 's #NenuLocal USA Premiere Collections ends by Thur 7pm IST#M9NewsWin1000 3rd contest pic.twitter.com/PcsmdS09lQ
— M9News (@M9News) 31 January 2017



