గతంలో తప్పులు చేసినా పర్వాలేదు.. జనసేనలోకి ఆహ్వానిస్తున్నా

Pawan-Kalyan's-Filmy-Remark-Sets-Twitter-Afire!!జీ మంత్రి రావెల కిషోర్ బాబు ఇటీవలే జనసేనలో చేరడంపై సర్వత్రా చర్చ జరుగుతుంది. గతంలో రావెల కొడుకు ఒక ఆడపడుచును ఏడిపించిన ఘటన వీడియోలో చిక్కినా కడుపు తీపితో అతనిని కాపాడిన రావెలను పార్టీలోకి తీసుకోవడమేంటీ అని సొంత పార్టీ వారే విమర్శించారు. ఆయన పార్టీలో చేరే క్రమంలో రావెల కొడుకుకి స్వయంగా ఆశీర్వాదం కూడా ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఈ వివాదంపై పవన్ కళ్యాణ్ ఒక వివరణ ఇచ్చారు ఇండైరెక్టుగా అయినా…

[m9ad]

ADVERTISEMENT

అనంతపురంలో ఒక బహిరంగసభలో మాట్లాడుతూ… “గతంలో తప్పులు చేసినా పర్వాలేదు.. జనసేనలో విలువలతో కూడిన రాజకీయం చేద్దాం రండి.. అయితే వీడు సినిమా హీరో వీడికి రాజకీయం అంటే తెలీదు అని మళ్ళీ తప్పులు చేస్తామంటే మాత్రం ఊరుకునేది లేదు. మీకు పాత తరం రాజకీయాలు అలవాటు అయిపోయాయి. నా దగ్గర మాత్రం కుదరదు. మీ అందరికి ఇంటికెళ్లి సుఖంగా చేసుకునే కొన్ని పనులు ఉంటాయి. పవన్ కళ్యాణ్ కు అలాంటి ఆశలు ఏమీ లేవు. ఇంటి నుండి వేసుకుని వచ్చిన చొక్కాతో మళ్ళీ ఇంటికి వెళ్లడమే లేదంటే లేదు,” అని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్.

దీనితో పక్క పార్టీల నుండి నాయకులను చేర్చుకోవడానికి పవన్ కళ్యాణ్ తనకు తానే లైసెన్స్ ఇచ్చుకున్నట్టు అయ్యింది. ఇక జనసేనలో నుండి పక్క పార్టీలకు చెందిన అవినీతిపరులైన నాయకులు వచ్చినా వారంతా మారిపోయి పార్టీలోకి తిరిగొచ్చారని మనమంతా అనుకోవడమే. గతంలో పక్క పార్టీల నుండి నాయకులను తీసుకోను కొత్త తరం నాయకులను తయ్యారు చేస్తాం అంటూ అన్ని జిల్లాలలో పరీక్షలు పెట్టిన పవన్ కళ్యాణ్ మాట మార్చేశారు అనుకోవడమే.

గతంలో ప్రజారాజ్యం పార్టీలో ఎలా అయితే జరిగిందో ఆ ప్రకారమే జనసేన రాజకీయం నడుస్తుంది. అయితే ప్రజారాజ్యం కంటే భిన్నమైన పరిస్థితులు ఉండాలని ఆ పార్టీని అభిమానించే వారు కోరుకుంటారు. మరోవైపు తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాలకు చెందిన ఇద్దరు అధికారపక్ష ఎమ్మెల్యేలు జనసేనతో టచ్ లో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే వీరిద్దరూ పార్టీలో ఆంటీముట్టనట్టు ఉంటున్నట్టు సమాచారం. వీరు ఇద్దరు కూడా గతంలో తప్పులు చేసి ఇప్పుడు జనసేన కోసం మారిపోయిన వారేనని సమాచారం.

ADVERTISEMENT
Latest Stories