బీజేపీతో పొత్తు కోసం తహతహలాడుతోంది అనే మెస్సేజ్ వెళ్లి పల్చనయ్యింది జనసేన

Pawan-Kalyan----Jansena-Party----BJPరెండు రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ బీజేపీ అధినేత బండి సంజయ్ తాము జీహెచ్ఎంసి ఎన్నికలలో ఒంటరిగా వెళ్తున్నామని, జనసేన సహా ఎటువంటి పార్టీతో పొత్తు లేదని తేల్చి చెప్పారు. ఆ ప్రకటన వచ్చిన కొన్ని నిమషాలలోనే పవన్ కళ్యాణ్ జీహెచ్ఎంసి ఎన్నికలలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించేశారు.

బీజేపీ ఇచ్చిన ఝలక్ కు జనసేన ఫాస్ట్ కౌంటర్ ని అందరు మెచ్చుకున్నారు అప్పుడు. పవన్ కళ్యాణ్ కరెక్ట్ గా రియాక్ట్ అయ్యాడని జనసైనికులు కూడా అన్నారు. అయితే ఈలోగానే జనసేన రాజకీయంగా ఇంకో తప్పటడుగు వేసేసింది. తెరవెనుక ఏం జరిగిందో తెలీదు గానీ బీజేపీతో పొత్తు చర్చలు జరుపుతున్నామని ప్రకటించింది ఆ పార్టీ.

ADVERTISEMENT

“జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో కలసి పోటీచేయడానికి గల అవకాశాలను పరిశీలించాలని జనసేన, భారతీయ జనతా పార్టీలు నిర్ణయించాయి. ఈ రోజు మధ్యాహ్నం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని బి. జె.పి. తెలంగాణ అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారు, ఆ పార్టీ అగ్ర నేతలు కలవనున్నారు,” అని జనసేన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేశారు.

అయితే అది జరిగిన కొన్ని నిముషాలకే “అటువంటి మీటింగ్ ఏమీ లేదు. పొత్తుల పై ఎటువంటి చర్చలు జరగడం లేదు. మా అభ్యర్థుల లిస్టు రెడీగా ఉంది. రిలీజ్ చెయ్యడానికి సిద్ధం అవుతున్నాం,” అని ప్రకటించారు. మీడియాలో లీక్ గా ఇవ్వాల్సిన న్యూస్ ని అధికారికంగా ప్రకటించి అభాసుపాలయ్యింది జనసేన. ఇప్పుడు బీజేపీతో పొత్తు కోసం తహతహలాడుతోంది అనే మెస్సేజ్ ప్రజలలోకి వెళ్లి పల్చనయ్యింది.

janasena bjp

ADVERTISEMENT
Latest Stories