పవన్ ఇచ్చే కిక్ వేరు కదా… అందుకే రహస్యంగా..!

pawan-kalyan-attends-khaidi-no-150‘పవర్ స్టార్’ అన్న పేరు పలికితే చాలు… అభిమానులు పూనకం వచ్చినట్లుగా ఉప్పొంగిపోతుంటారు. అలాంటి తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్… తన అన్నయ్య నటించే 150వ సినిమా ఆడియో వేడుకకు హాజరు అవుతారా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ విషయంలో మెగా క్యాంప్ నుండే విభిన్న స్పందనలు రావడంతో ప్రేక్షకులు, అభిమానులు ఎవరి మాటను నమ్మాలో తెలియడం లేదు.

చెర్రీనేమో తనకేమీ తెలియదని, రావాలో, వద్దో అన్న విషయం పవన్ వ్యక్తిగత విషయంగా తెల్చేయగా, మామ అల్లు అరవింద్ మాత్రం ఆ రోజు పవన్ విదేశాలకు వెళ్తున్నట్లుగా తమకు కబురు అందిందని చెప్పారు. ఈ రెండు వార్తలు ఇలా హల్చల్ చేస్తున్న నేపధ్యంలో… పవన్ వదిన, చిరంజీవి సతీమణి స్వయంగా పవన్ ఇంటికి వెళ్లి ఆహ్వానం పలికినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో అసలు పవన్ వస్తారా? లేదా? అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

ADVERTISEMENT

అయితే పవర్ స్టార్ కున్న క్రేజ్ రీత్యా, పవన్ రాకను అత్యంత గోప్యంగా ఉంచినట్లుగా సమాచారం అందుతోంది. అన్నయ్య చేసుకునే వేడుకకు తమ్ముడు రాకుండా ఎందుకు ఉంటారని, ఫైనల్ పంచ్ పవన్ దే అయ్యుండాలని, పవర్ స్టార్ ఇచ్చే కిక్ మెగా క్యాంప్ కు కూడా తెలుసని, అందుకే అభిమానులకు ‘స్వీట్ షాక్’ ఇచ్చేందుకు పవన్ రాకను బహిరంగంగా వెల్లడించకుండా ‘ఖైదీ నంబర్ 150’ చిత్ర యూనిట్ దోబూచులు ఆడుతోందని సినీ జనాలు చెప్పుకుంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories