ఎన్నాళ్ళని దాచగలవు పవన్?

Lawyer Saab It Is For Powerstar Pawan Kalyan’s Comebackజనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండేళ్ళ గ్యాప్ తరువాత తిరిగి సినిమాల్లోకి ఎంటర్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆయన తన కమ్ బ్యాక్ ఫిలిం, పింక్ రీమేక్ షూటింగ్ ఇటీవలే మొదలు పెట్టారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మరో సినిమా ఈరోజు ఉదయం అల్యూమినియం ఫ్యాక్టరీ లో ముహూర్తం జరుపుకుంది.

అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ ముహూర్తానికి సంబంధించిన వార్తను అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పటికే సెట్స్ మీద ఉన్న పింక్ రీమేక్ సినిమాకు సంబంధించిన వార్తలు కూడా నిర్మాతలు వెల్లడించలేదు. దీనికి కారణం పవన కళ్యాణ్ అట. సినిమాలు చేస్తున్నట్టు తెలిస్తే తనకు రాజకీయంగా నష్టమని ఆయన అనుకుంటున్నారట.

ADVERTISEMENT

దీనితో ఇరు చిత్ర బృందాలు సైలెంట్ గా తమ పని కానిస్తున్నారు. అయితే ఈ విషయాన్నీ ఎంత కాలమని దాచగలరు? ఈరోజు కాకపోతే రేపైనా సినిమా విడుదల కావాల్సిందే కదా? సినిమా రిలీజ్ కాకుండా ప్రేక్షకులకు తెలియకుండా ఉంచలేరు కదా? మరి పవన్ కళ్యాణ్ మనసులో ఏముందో?

క్రిష్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న సినిమా ఒక పీరియడ్ సినిమా అని తెలుస్తుంది. ఇటువంటి సినిమా పవన్ చెయ్యడం ఇదే తొలిసారి. క్రిష్ సినిమా ఫిబ్రవరి మొదటి వారంలో సెట్స్ మీదకు వెళ్లబోతుంది. పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ షూటింగ్ పూర్తి చేసుకుని ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టె అవకాశం ఉంది. రెండు సినిమాలు ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories