పవన్ కళ్యాణ్ కొత్త ఇంటికి 70 కోట్లా?

Pawan Kalyan new house construction costs 70 croresజనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ రాజధాని అమరావతిలో నివాసమేర్పరుచుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా సమీపంలో సొంత ఇంటి నిర్మాణానికి సోమవారం ఉదయం ఆయన భూమిపూజ చేశారు. మురగన్‌ హోటల్‌ రోడ్డులోని సాహితీ వెంచర్‌లో ఈ ఇంటి నిర్మాణం చేపట్టనున్నారు.

ADVERTISEMENT

అయితే ఇప్పుడు ఈ ఇంటిపై సోషల్ మీడియాలో కొందరు విమర్శలు చేస్తున్నారు. విజయవాడ హైవేలాంటి అత్యంత ఖరీదైన ప్రాంతంలో సొంత ఇల్లు అంటే మాటలు కాదు. రెండెకరాల స్థలం ఎలా కాదనుకున్నా 30 కోట్లు ఉంటుందట. రెండు ఎకరాలలో ఇల్లు అంటే చాలా విలసవంతంగా ఉండే అవకాశం ఉంది. కనీసం 40 కోట్లు నిర్మాణవ్యయం ఉండవచ్చని అంచనా.

తన దగ్గర పని చేసేవారికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి లో ఉన్నా అని, ఆర్ధిక బాధల వల్ల తన కారు కూడా అమ్ముకున్నా అని కొన్ని సంధర్భాలలో పవన్ కళ్యాణ్ చెప్పడం మనమందరం చూశాం. అలాంటిది ఉన్నఫళంగా 70 కోట్ల ఇల్లు ఎక్కడనుండి వచ్చిందని వారంతా ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రజలకు దగ్గరలో ఉండేందుకే అమరావతిలో నివాసం ఏర్పాటు చేసుకుంటున్నానని పవన్ చెప్పారు.

ADVERTISEMENT
Latest Stories