ఇంటర్నేషనల్ బ్రాండ్ గా చేస్తా – పవన్ కళ్యాణ్!

Pawan Kalyan on Handlooms Andhra pradeshజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను చేనేత సంఘాల నాయ‌కులు, కార్మికులు హైద‌రాబాద్‌, జూబ్లిహిల్స్‌ లోని పార్టీ కార్యాల‌యంలో కలిసి, త‌మ స‌మ‌స్య‌ల‌పై వివ‌రించి, పవన్ కు చేనేత వ‌స్త్రాల‌ను బహుకరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్… వచ్చే నెల గుంటూరు జిల్లా మంగళగిరిలో జరగనున్న చేనేత సత్యాగ్రహానికి ముఖ్య అతిధిగా చేనేత సంఘాలు తనను ఆహ్వానించారని, వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

చేనేత జాతి సంపద అని, చేనేత అరుదైన కళ అని, ఆ కళకు ప్రోత్సాహకాలిచ్చి, కార్మికులను గుర్తించాల్సిన అవసరం ఉందని, కార్మికుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచించారు. చేనేతకు తనకు చేతనైనంత సాయం చేయాలన్న ఆలోచన ఉంది కానీ, తనది చాలా పరిమితమైన విజ్ఞానం అని, కనుక దానిపై పలువురితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని, ఇకపై వారంలో ఒక రోజు చేనేత దుస్తులే ధరిస్తానని, తనలాగే చేయమని పలువురికి సూచిస్తానని అన్నారు.

ADVERTISEMENT

అంతే కాకుండా మిలాన్ లాంటి నగరంలో కశ్మీరీ వర్క్ ను డిజైనర్లు కొనుగోలు చేస్తారని, అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేయగల మన వారి నైపుణ్యం వారికి అవసరం ఉంటుందని భావిస్తున్నానని, అలా చేనేతను “అంతర్జాతీయ బ్రాండ్”గా చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఉందని, ఇందుకు తనకు చేతనైనంత చేస్తానని, చేనేతకు ‘బ్రాండ్ అంబాసిడర్’గా ఉంటానని మరోసారి స్పష్టం చేసారు.

ADVERTISEMENT
Latest Stories