Pawan Kalyan Panchayat Gram Sabhas

సాధారణంగా గ్రామాలకు సంబందించిన వార్తలంటే నగర, పట్టణ ప్రజలు పెద్దగా ఆసక్తి చూపరు. బహుశః అందువల్లేనేమో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఒకేసారి 13,326 గ్రామ పంచాయితీలలో గ్రామసభల వార్తకి సోషల్ మీడియాలో కూడా పెద్దగా పట్టించుకోలేదు.

Also Read – సీఎం నినాదాలు: పార్టీ శ్రేణుల అత్యుత్సాహం…

కానీ రాజకీయంగా తనని తాను నిరూపించుకున్న పవన్‌ కళ్యాణ్‌, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కూడా నిరూపించుకోవాలని చాలా పట్టుదలగా ఉన్నారు.

అందుకే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గామాలలో సమస్యలు, మౌలిక వసతుల కల్పన, గ్రామీణాభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి నేడు ఈ గ్రామసభలను నిర్వహింపజేశారు.

Also Read – ఉగ్రవాదులు శ్రీనగర్‌లోనే ఇళ్ళు కట్టుకు నివసిస్తున్నా…

కేంద్ర ప్రభుత్వం పంచాయితీలకు నేరుగా నిధులు కేటాయిస్తుంటుంది. గత ఏడాది కూడా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పంచాయితీలకు రూ.40,579 కోట్లు విడుదల చేసింది. కానీ జగన్‌ ప్రభుత్వం వాటిని పక్కదారి పట్టించడంతో గ్రామాలలో పరిస్థితి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది.

కనుక ఇకపై ఈ నిధుల కేటాయింపు, వినియోగంపై ఎప్పటికప్పుడు సోషల్ ఆడిట్ చేయించేందుకు ఓ సమర్ధుడు, నిజాయితీపరుడైన ఐపీఎస్ అధికారికి అప్పగించాలని పవన్‌ కళ్యాణ్‌ నిర్ణయించారు.

Also Read – వైఎస్ షర్మిల: ఏపీ రాజకీయాలలో ఎక్స్‌ట్రా ప్లేయర్?

మరో విషయం ఏమిటంటే, జగన్‌ హయాంలో సర్పంచ్‌లకు చెక్ పవర్ లేకుండా చేసి గ్రామాలలో వారి మాటకి విలువ, వారికి గౌరవం లేకుండా చేశారు. కానీ నేడు జరుగుతున్నా గ్రామసభలన్నీ ఆ సర్పంచ్‌ల ఆధ్వర్యంలోనే జరిగేలా చేసి మళ్ళీ వారికి పూర్వ గౌరవం, ప్రాధాన్యం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

ఏదో మొక్కుబడిగా సాగే గ్రామ సభల వలన ఎటువంటి ప్రయోజనం ఉండదని భావించిన పవన్‌ కళ్యాణ్‌, ఆ పనులకు అవసరమైన నిధులను సమకూర్చే బాధ్యతని తీసుకున్నారు. నేడు జరుగుతున్న ప్రతీ గ్రామసభలో మౌలిక వసతులకు సంబందించి గ్రామస్తుల పిర్యాదులను, సమస్యలను తప్పనిసరిగా లిఖిత పూర్వకంగా రికార్డ్ చేయాలని, నిర్ధిష్టమైన కాలపరిధిలో వాటిని పరిష్కరించాలని ఆదేశించారు.

అంతేకాదు.. గ్రామాలు స్వయంసంవృద్ధి సాధించేందుకు కూడా పవన్‌ కళ్యాణ్‌ ప్రణాళికలు సిద్దం చేయిస్తున్నారు. ఒక్కో జిల్లాలో ఒక్కో రకమైన సహజవనరులు కలిగి ఉంటుంది. చాలా గ్రామాలలో చెరువులు, ప్రభుత్వ భూములు ఉంటాయి.

చెరువులలో చేపల పెంపకం, ఖాళీ భూములలో టేకు, పామాయిల్ తదితర ఫలసాయం అందించే చెట్ల పెంపకం ప్రోత్సహించి వాటి ద్వారా గ్రామాలకు అదనపు ఆదాయం సమకూర్చాలని పవన్‌ కళ్యాణ్‌ ప్రణాళికలు సిద్దం చేయిస్తున్నారు.

గ్రామీణ ఉత్పత్తులకు… అవి కోళ్ళు, మేకలు, పాలు, కూరగాయలు, కొబ్బరికాయలు ఏవైనా కావచ్చు వాటికి రాష్ట్రంలో మార్కెటింగ్ సౌకర్యం కల్పించగలిగితే గ్రామాలు స్వయంసంవృద్ధి సాధించగలవని పవన్‌ కళ్యాణ్‌ గట్టిగా నమ్ముతున్నారు. ఆ దిశలో కూడా కార్యాచరణ సిద్దం చేయిస్తున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ పట్టుదల, నిబద్దత, నిజాయితీ, దేశభక్తి గురించి అందరికీ తెలిసిందే. కనుక పవన్‌ కళ్యాణ్‌ పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం గ్రామీణ ప్రజల అదృష్టమనే భావించవచ్చు. బహుశః ఒకటి రెండేళ్ళలోనే రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో సమూలమైన మార్పు తప్పక కనిపించవచ్చు.