పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో నిరీక్షిస్తున్న సినిమాకు సంబంధించి మొదటి పాట బయటకు వచ్చింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘బయటకొచ్చి చూస్తే’ పాట పవన్ అభిమానులను అలరిస్తోంది. వినడానికి రెగ్యులర్ తెలుగు సినిమా పాటలా లేకపోవడంతో అన్ని వర్గాలకు చేరువ అవుతుందో లేదో గానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం ఈ పాటతో మాంచి ఉత్సాహంలో ఉన్నారు.
శ్రీమణి అందించిన సాహిత్యం ప్రధాన హైలైట్ కాగా, అనిరుధ్ స్వరపరిచిన సంగీతానికి మంచి స్పందన రావడంతో మిగిలిన పాటలపై అంచనాలు బాగా పెరిగాయి. ఈ సినిమా టైటిల్ లోగోను విడుదల చేస్తారని భావించినప్పటికీ, అది విడుదల కాకపోయినా ఈ సింగిల్ ట్రాక్ తో పవన్ ఫ్యాన్స్ సంతృప్తి చెందారు. సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్న ఈ సినిమా టాలీవుడ్ లో సరికొత్త రికార్డులకు వేదిక అవుతుందేమో చూడాలి.





