బహిరంగ ప్రకటనలు హీరోయిజం కాజాలవు…

Pawan Kalyan remarks spark coalition tension

రాజకీయాలలో ఏది మంచి ఏది చేదు, ఏది ధర్మం ఏది అధర్మం, న్యాయం ఏది అన్యాయం ఏది అని ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు. సమయాన్ని, సందర్భాన్ని బట్టి వీటి లెక్కలు పూర్తిగా మారిపోతుంటాయి.

అయితే కూటమి పొత్తులో భాగంగా ప్రభుత్వంలో భాగమైన టీడీపీ, జనసేన పార్టీల మధ్య తరచుగా రాజకీయ వివాదాలు, వ్యక్తిగత విభేదాలు దర్శనమిస్తున్నాయి. అలాగే ఎవరి పార్టీల మద్దతుదారులు తమ నాయకుడిని వెనకేసుకొస్తూ తమవారిదే రైట్ అవతలి వారిది రాంగ్ అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు.

ADVERTISEMENT

తాజాగా భీమవరం డిఎస్పీ విషయంలో డిప్యూటీ సీఎం హోదాలో పవన్ చేసిన వ్యాఖ్యలు అటు టీడీపీ వారిని బాధిస్తుంటే ఇటు అదే అంశం పట్ల డిప్యూటీ స్పీకర్ రఘురామా రాజు ఇచ్చిన ప్రకటనలు జనసేన వారిని ఇబ్బంది పెడుతున్నాయి.

అయితే ఈ విషయంలో ఎవరిదీ తప్పు ఎవరిదీ ఒప్పు అనేదానికన్నా అసలు ఇటువంటి అంశాల పట్ల బహిరంగ ప్రకటనలు ఇవ్వడం అంటే అది ప్రత్యర్థి పార్టీకి అస్త్రాలు ఇచ్చినట్టే అవుతుంది. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ కు అన్ని శాఖల మీద హక్కు ఉన్నప్పటికీ అది బహిరంగ ప్రకటనలు చేసేలా ఉండకూడదు.

ఒకపక్క ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేష్, పవన్ కు ప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యం కల్పిస్తున్నారు, పూర్తి స్వేచ్ఛను అందిస్తున్నారు. అలాగే ఇటు పవన్ సైతం కూటమి పొత్తు మరో 15 ఏళ్లపాటు ఇలానే కొనసాగాలని ఆశిస్తున్నారు, తన పార్టీ క్యాడర్ కి గీతోపదేశం చేస్తున్నారు.

ఇటువంటి సమయంలో పవన్ హోమ్ శాఖ మంత్రి తో అంతర్గతంగా మాట్లాడుకోవాల్సిన అంశాలను ఇలా బహిరంగంగా ప్రకటించడం, మంత్రి అనిత అనుమతి లేకుండా విచారణలకు ఆదేశాలివ్వడం ఖచ్చితంగా హోమ్ మంత్రి అనితకు ఇబ్బందులు తెచ్చే పెట్టె అవకాశం ఉంటుంది.

అనిత ఒక డమ్మీ మంత్రి అని, హోమ్ శాఖ పై అనిత కన్నా పవన్ కే ఎక్కువ అధికారాలు ఉన్నాయని, అనిత తన శాఖను సమర్ధవంతంగా నిర్వహించలేకపోతున్నారంటూ ప్రత్యర్థి వైసీపీ అనితను టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని వారికి వెండి పళ్లెంలో పెట్టి మరి పవన్ అందిస్తుండడం ఇక్కడ గమనార్ధం.

అయితే హోమ్ శాఖలో పవన్ ఇలా వేలుపెట్టడం ఇది రెండో సారి. అయితే ఇలా పవన్ ఇతర శాఖలలో వేలెట్టడాన్ని సమర్ధించుకుంటున్న జనసేన, పవన్ వేలు పెట్టిన దానిలోకి రఘురామా కాలు పెడితే తప్పు బడుతున్నారు. అనిత చెయ్యాల్సిన పని పవన్ చెయ్యడం ఎంత తప్పో పవన్ ఇచ్చిన స్టేట్మెంట్ కి వ్యతిరేకంగా RRR ప్రకటన చెయ్యడం కూడా అంటే తప్పు.

ఇవన్నీ కూడా ప్రతి ప్రభుత్వంలోని జరిగే తంతే. కాకపోతే అవన్నీ కూడా ప్రజలకు, ప్రతిపక్షాలకు తెలియాల్సిన అవసరం లేదు. కూటమి ప్రభుత్వంలో ఎవరి వారు ఇలా ప్రభుత్వ నిర్ణయాలను, ఇతర మంత్రుల వ్యవహారాలను బహిరంగా చర్చించడమే ఇక్కడ వివాదాస్పదం అవుతుంది.

పవన్ వ్యాఖ్యలతో అనిత ఇబ్బందిపడుతుంటే, రఘురామా ప్రకటనలతో పవన్ కి ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ఒక ప్రభుత్వంలోని నాయకులే ఇలా రెండు విరుద్ధమైన ప్రకటనలు చేస్తే అది ప్రతిపక్షానికి ఆహారం అందించడమే అవుతుంది, ప్రజలకు తమ మధ్య ఉన్న సమన్వయ లోపాన్ని బహిర్గతం చేయడమే అవుతుంది.

మూడు పార్టీల మధ్య రాజకీయ పొత్తు ఉన్నప్పుడు ఈ రకంగా ఎవరికీ నచ్చిన విధంగా వారు బహిరంగ వ్యాఖ్యలు చేయడం హీరోయిజం అనిపించుకోదు అనేది అందరు నాయకులు గమనించాల్సి ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories