పవన్ రాజీనామా ప్రచారం….

Pawan Kalyan Resignation Rumours in AP

కూటమి పార్టీల మధ్య రాజకీయ చీలిక తెచ్చేందుకు వైసీపీ ఎంతగానో శ్రమిస్తోంది. వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకూడదు అనేలా, ప్రతి అంశంలోనూ ఒక అవకాశాన్ని వెతుక్కోవాలనేలా వైసీపీ శ్రేణులు టీడీపీ, జనసేన మధ్య చీలిక కోసం కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు.

అయితే కాగల కార్యం గంధర్వులే పూర్తి చేసినట్టు వైసీపీ ఆశలను నెరవేర్చేందుకు ఏపీ స్థానిక ఎన్నికలు వారికొక మంచి అవకాశం గా మారాయి. ఇరు పార్టీల మధ్య మొదలైన సీట్ల పంచాయితీ ఇరు పార్టీల అధినేతల టార్గెట్ గా ముందుకెళ్లాయి.

ADVERTISEMENT

టీడీపీ మీద నిందలు వేస్తూ జనసేన శ్రేణులు, జనసైనికులను తక్కువ చేస్తూ టీడీపీ తమ్ముళ్లు ఇరువురు కూడా ఇరు పార్టీల నేతలను తమ సోషల్ మీడియా యుద్ధంలోకి లాక్కొచ్చారు. ఈ నేపథ్యంలో సందు కోసం చూసిన వైసీపీ కి టీడీపీ, జనసేన మద్దతుదారులు ఒక హై వే నే ఏర్పాటు చేసారు.

జనసేన మీద సానుభూతి వ్యక్తపరుస్తూ టీడీపీ ని దూషిస్తూ, టీడీపీ వారిని రెచ్చకొడుతూ జనసైనికులను ద్వేషిస్తూ వైసీపీ ఈ రెండు పార్టీల మధ్య మొదలైన నిప్పుతో చలికాచుకోవడం మొదలుపెట్టింది. ఇలా ఇదంతా ఒకపక్కన నడుస్తున్న తరుణంలో తాజాగా సోషల్ మీడియాలో జనసేనాని పవన్ కు సంబంధించిన మరో అంశం వైరల్ గా మారింది.

స్థానిక ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన తరువాత పవన్ కళ్యాణ్ తన ఉపముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారని, ఆ తరువాత ఎదో ఒక బలమైన రాజకీయ ప్రకటన చెయ్యబోతున్నారంటూ సోషల్ మీడియా లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది.

ఆ ప్రచారం లో నిజానిజాలు ఎంత అనే బేరీజు కూడా వేయకుండా ఇటు జనసేన మద్దతుదారులు సైతం త్వరలో పవన్ రాజీనామా, ఆ పై ప్రతిపక్ష నేత పాత్ర, కూటమి నుంచి జనసేన బయటకు రాబోతుంది అంటూ ఆ ప్రచారానికి మరికొంత మసాల జోడించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

అయితే ‘డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్’ వాట్స్ అప్ పేరుతో జరుగుతున్న పవన్ రాజీనామా ప్రచారం అవాస్తమని, అసలు ఆ వాట్స్ అప్ ఛానెల్ ప్రభుత్వ అధికారిక ఛానెల్ కాదని జనసేన స్పష్టత ఇచ్చింది. ప్రభుత్వ అధికారిక కార్యాలయం మాదిరి వ్యవహరిస్తూ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న సదరు సోషల్ మీడియా చర్యల పై అధికారులకు ఫిర్యాదు చేస్తామంటూ ప్రకటించింది.

ADVERTISEMENT
Latest Stories