గత నాలుగైదు రోజులుగా రోజు ఏదొక అంశంపై ట్వీట్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్, తాజాగా ఓ సెల్ఫీతో రచ్చ చేస్తున్నాడు. ప్రస్తుతం “కాటమరాయుడు” సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్, లంచ్ విరామంలో భోజనం చేస్తున్న నటులతో కలిసి ఓ సెల్ఫీ కొట్టాడు.
‘కాటమరాయుడు’ సినిమాలో తన సోదరులుగా నటిస్తున్న ‘శివబాలాజీ అండ్ కో’ కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ‘కాటమరాయుడు అండ్ కో’ చేస్తోన్న ఈ లంచ్ లో ఎక్కడా నాన్ వెజిటేరియన్ కనపడకపోవడం విశేషం. చిత్ర యూనిట్ లో నుండి ఎవరో ఒకరి ఇంటి వద్ద నుండి ప్రత్యేకంగా వచ్చిన భోజనం ఏమో గానీ… పవన్ స్పెషల్ గా ‘సెల్ఫీ’ క్లిక్ మనిపించాడు.
ADVERTISEMENT
ADVERTISEMENT



