* జనసేన…
2014 లో పార్టీ స్థాపించినప్పటికీ అప్పటి సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయక ఏపీలో ఎన్డీయే కూటమికి తన మద్దతు ప్రకటించడంతో పాటు ఆ కూటమి తరుపున రాష్ట్ర వ్యాప్త ప్రచారం కూడా చేసారు పవన్. అయితే రాజకీయాలలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు అంటూ ఎవరు ఉండరు అనేట్లుగా ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చి అప్పటి టీడీపీ , బీజేపీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తన గళం వినిపించారు పవన్.
ఇందులో భాగంగా వామపక్షాలు, బీఎస్పీ పార్టీలతో పొత్తు పెట్టుకుని ఒంటరి పోరు చేసి తానూ పోటీ చేసిన రెండు స్థానాలలో కూడా ఓటమి పాలయ్యారు. అలాగే జనసేన పోటీ చేసిన ఒక్క రాజోలు మినహా మరే ప్రాంతంలోనూ జనసేన జెండా ఊసేలేకుండా పోయింది. అంతటి స్టార్ హీరో, మాస్ చెరిష్మా ఉన్న లీడర్ గా ఉన్న పవన్ తన పార్టీ నుండి కేవలం ఒక్క సీటు సాధించడంతో పార్టీ పట్ల, పార్టీ అధినేత పవన్ పట్ల చాలామందిలో చిన్న చూపు మొదలయ్యింది.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడంలో పవన్ చాల బలమైన పాత్ర పోషించడంలో టీడీపీ గద్దె దిగి వైసీపీ కి అధికార పీఠం అప్పగించింది. దీనితో పవన్ ను, జనసేన పార్టీ ని, ఆ జెండా మోస్తున్న క్యాడర్ ను అత్యంత హీనంగా కించపరుస్తూ, వారి ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడుతూ, పవన్ ఓపికకు, సహనానికి పరీక్ష పెట్టింది వైసీపీ పార్టీ.
పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయావు అంటూ హేళన చేయడం, మూడు పెళ్లిళ్లు అంటూ వ్యక్తిగత జీవితాన్ని రాజకీయ వేదికల మీదకు తీసుకురావడం స్వయానా ముఖ్యమంత్రి జగనే ఇటువంటి విమర్శలు చేయడంతో ఈసారి పవన్ గెలుపు అనివార్యం కానుంది. ఈసారి ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిలనివ్వను అంటూ ‘హలో ఏపీ..బై బై వైసీపీ’ అనే నినాదంతో ఎన్డీయే కూటమితో బరిలోకి రానున్నారు పవన్.
పొత్తు పెట్టుకున్నటీడీపీ తో పాటు జనసేన కూడా రాష్ట్ర అసెంబ్లీ లో బలమైన పాత్ర పోషించడం అత్యంత అవసరం అనే కంటే జనసేనకు ఈ 2024 ఎన్నికలు జీవన్మరణ సమస్యే అనవచ్చు. ఈసారి కూడా పవన్ తనను, తన పార్టీని గెలిపించుకోలేక పొతే ఇక ఆయన రాజకీయ జీవితానికి శుభం కార్డు పడినట్లే భావించాలి.
* కాంగ్రెస్…
రాష్ట్ర విభజనతో ఏపీ పునాదులలో సమాధి అయిన పార్టీ కాంగ్రెస్. ఆనాటి నుంచి ఈనాటి వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా పట్టుకున్న కార్యకర్తే లేరంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి. సమాధిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ షర్మిల రాకతో ఉపిరిపోసుకుంది. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలో వచ్చిన వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకోగలిగారు వైసీపీ పార్టీ అధినేత జగన్.
ఇప్పుడు అదే అన్నకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధినేతగా వచ్చిన షర్మిల ఏపీలో మొదలుపెట్టిన రాజకీయంతో ఒక్కసారిగా లైవ్ లైట్ లోకి వచ్చింది కాంగ్రెస్. ప్రభుత్వ వ్యతిరేక ఓటును తన వైపు మరల్చుకుని తిరిగి కాంగ్రెస్ పార్టీ కి పూర్వవైభవం తీసుకురావాలని, అన్నను ముఖ్యమంత్రి పదవి నుంచి దింపాలనే పట్టుదలతో వైఎస్ కుమార్తె సునీతా తోకలిసి రాజకీయ ప్రచారం మొదలుపెట్టారు.
అన్నతో మొదలుపెట్టిన రాజకీయ యుద్ధంలో తన పార్టీ గెలవలేక పోయిన, తానూ గెలిచి తన అన్న పార్టీ వైసీపీ ని ఓడించడమే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. ఈ 2024 ఎన్నికలలో తన ప్రభావం చూపించడంలో కాంగ్రెస్ విజయం సాధించగలిగితే రాబోయే రోజులలో రాష్ట్రంలో ఆ పార్టీ జెండా రెపరెపలాడే అవకాశం ఉంది. అయితే ఈ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీకి వచ్చే బలం కన్నా వైస్ షర్మిల సాధించే పట్టు మీదే అందరి ద్రుష్టి.
ఇప్పటికే తెలంగాణలో జెండా పీకేసిన షర్మిల ఏపీ రాజకీయాలలో అయినా రాణించకపోతే అటు తండ్రి పేరు చెడగొట్టిన కూతురుగా, ఇటు అన్న తో చివాట్లు తిన్న చెల్లేలుగా మిగిలిపోవాల్సిందే. ఇప్పటికే తనకు వ్యతిరేకంగా వేసిన తొలి అడుగు కారణంగా వైఎస్ షర్మిల రెడ్డి ని మురుసుపల్లి షర్మిల శాస్త్రిగా తెలుగు ప్రజలకు పరిచయం చేసారు జగన్. తన అస్తిత్వాన్ని నిలుపోకోవాలన్నా, రాజకీయంగా ఎదగాలన్నా ఈ ఎన్నికల్లో షర్మిల విజయం అనివార్యమే.






