జగన్ కు పవన్ కళ్యాణ్ పొలిటికల్ పంచ్

Pawan Kalyan strong answer to ys jaganజనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ రాజధాని అమరావతిలో నివాసమేర్పరుచుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా సమీపంలో సొంత ఇంటి నిర్మాణానికి సోమవారం ఉదయం ఆయన భూమిపూజ చేశారు. మురగన్‌ హోటల్‌ రోడ్డులోని సాహితీ వెంచర్‌లో ఈ ఇంటి నిర్మాణం చేపట్టనున్నారు.

ఈ సంధర్భంగా పవన్ కళ్యాణ్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు తొత్తు అని జగన్, వైకాపా నాయకులు చేస్తున్న విమర్శలకు ఆయన ఘాటుగా స్పందించారు. జనసేనకు చంద్రబాబు అయితే వైసీపీకి స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మోదీ అనుకోవాలా?” అని ఆయన ప్రశ్నించారు.

ADVERTISEMENT

ఒక విమర్శ చేయడం ఎంతో సులభమని.. దానికన్నా ముందు నిజానిజాలను తెలుసుకోవాలని హితవు పలికిన ఆయన, రాజకీయ నాయకులు ఆలోచించి మాట్లాడాలని సూచించారు. “నా ఆస్తులు ఎవరినీ దోచేసినవి కావు… నేను కష్టపడి సంపాదించుకున్నా… ప్రజలిచ్చిన ఆస్తులు… కొన్ని సార్లు పోగొట్టుకున్నా మళ్లీ తిరిగి సంపాదించుకున్నా, అవసరం వస్తే ఆస్తులు ప్రకటిస్తా,” అని కూడా పవన్ కళ్యాణ్ జగన్ ను పరోక్షంగా విమర్శించారు.

ADVERTISEMENT
Latest Stories