నువ్వొస్తానంటే… మేమొద్దన్నామా?

Pawan Kalyan speaking at a press conference in Hyderabad on Telangana politics and Janasena's future plans.

పవన్ కళ్యాణ్‌ జనసేన పార్టీ అధినేత మాత్రమే కాదు ఏపీ డెప్యూటీ సిఎం కూడా. ఆ హోదాలో ఉన్న వ్యక్తి హైదరాబాద్‌లో తన పార్టీ నేతలతో సమావేశం పెట్టుకుంటే నోటికొచ్చినట్లు మాట్లాడుతారని అనుకోరాదు. తెలంగాణలో జనసేన పార్టీ నిద్రాణస్థితిలో ఉంది కనుక వారికి దిశానిర్దేశం చేసి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించి వెళ్ళిపోయి ఉండేవారు. మహా అయితే ప్రొ. నాగేశ్వర్‌కి మరోసారి గట్టి కౌంటర్ ఇచ్చేవారేమో?

కానీ ఏపీ-తెలంగాణల మద్య మళ్ళీ ఉద్రిక్తతలు మొదలైనవేళ పవన్ కళ్యాణ్‌ సరిగ్గా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున హైదరాబాద్‌లో సభ-సమావేశం అనగానే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉలిక్కిపడింది. అది సహజమే.

ADVERTISEMENT

బీఆర్ఎస్‌, టీఆర్ఎస్‌ శ్రేణులు అక్కడికి వచ్చి హడావుడి చేస్తే సమస్య ఎదురవుతుందనుకోని ఉంటే అదే ముక్క ప్రభుత్వం తరపున ఎవరో ఒకరు పవన్ కళ్యాణ్‌తో చెప్తే ఆయన తప్పక సభ రద్దు చేసుకొని తర్వాత ఎప్పుడో పెట్టుకొని ఉండేవారు.

కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం సభకు అనుమతి నిరాకరించడంతో పవన్ కళ్యాణ్‌ కూడా మీడియా సమావేశం నిర్వహించాలని అప్పటికప్పుడు నిర్ణయించుకున్నారు. ఇంతకాలం ఏపీ, తెలంగాణలో ఉన్న ఆంధ్రా ప్రజలు అడగాలనుకుంటున్నవన్నీ ధైర్యంగా అడిగేశారు. ప్రతీ విమర్శకు జవాబు చెప్పారు.

ముఖ్యంగా తెలంగాణ అంటే పాకిస్తాన్‌ లేదా మరో దేశం కాదని అక్కడికి వచ్చి పోవడానికి లేదా పార్టీ పెట్టుకొని రాజకీయాలు చేసుకోవడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదని మొహం మీద గుద్ది చెప్పినట్లు మరీ చెప్పారు.

పవన్ కళ్యాణ్‌ ప్రసంగంపై తెలంగాణవాదం పేరుతో రాజకీయాలు చేసుకోలేనివారు జీర్ణించుకోలేకపోవచ్చు. కానీ ఏపీ, తెలంగాణలో ప్రజలు మాత్రం సంతోషిస్తున్నారు. ఇంతకాలం తాము ధైర్యం లేక అడగలేకపోయినవాటిని పవన్ కళ్యాణ్‌ అడిగెసి, కడిగేసినందుకు.

పవన్ కళ్యాణ్‌ భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, చట్టబద్దంగా ఉన్న ప్రాధమిక హక్కుల గురించే మాట్లాడారు. కనుక ‘తెలంగాణలో ఎలా అడుగుపెడతావో చూస్తామని’ బెదిరించినవాళ్ళే ‘నువ్వొస్తానంటే… మేమొద్దన్నామా? తెలంగాణకి ఎవరైనా రావచ్చు అంటూ మాటమార్చక తప్పలేదు.

కానీ ఇన్ని ప్రగల్భాలు పలికిన తర్వాత మాటకు మాట జవాబు చెప్పకపోతే పరువు పోతుంది. కనుక ‘పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ బిల్లు పెట్టడం తప్పనే’ మాట పట్టుకొని కూనిరాగాలు తీశారు. జనసేనని మేము అడ్డుకోము తెలంగాణ ప్రజలే బుద్ధి చెపుతారని సన్నాయి నొక్కులు నొక్కారు. పవన్ కళ్యాణ్‌ బిజేపి వ్రాసిచ్చిన స్క్రిప్ట్ చదివారంటూ వాళ్ళే రొటీన్ జవాబు చెప్పారు.

ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్‌ హుక్ షాట్ కొట్టి తెలంగాణ రాజకీయాలలో బ్యాటింగ్ మొదలుపెట్టారు. బిజేపితో కలిసి రాబోతున్నారని అందరికీ బాగానే అర్ధమైంది. అందుకు సంతోషించాల్సిందే.

ADVERTISEMENT
Latest Stories