pithapuram-pawan-kalyan

పదేళ్ల ఎదురు చూపులు, దశబ్దాల అవమానాలు, ఐదేళ్ల వెక్కిరింపులు – ఛీత్కారాలకు పిఠాపురం ప్రజలు అడ్డుకట్ట వేశారు. అవును, అన్న వదిలేసి పోయాడు తమ్ముడు నిలబడతాడా.? అన్న సందేహాలకు, నిలబడ్డ రెండు చోట్ల ఓడిపోయాడు అన్న అవమానాలకు, దత్తపుత్రుడు అంటూ చేసిన అవహేళనలకు పిఠాపురం దత్తాత్రేయుడు సాక్షిగా సమాధానం చెప్పారు పవన్ కళ్యాణ్.

Also Read – ఉండవల్లిలో జగన్‌ మ్యూజియం… భేష్ మంచి ప్రతిపాదనే!

ఓడిపోయావు అన్న నోటితోనే నెగ్గావు …నిలబెట్టావు అన్న ప్రశంసలు దక్కించుకున్నారు పవన్. గత ఎన్నికలలో పోటీ చేసిన భీమవరం, గాజువాక ప్రాంతాలలో ఓటమి చెందిన పవన్ ఈసారి తన ప్రయాణాన్ని పిఠాపురం నుండి మొదలుపెట్టారు. అయితే వైసీపీ వ్యతిరేక ఓటు చిలనివ్వను అంటూ పవన్ చేసిన శపధాన్ని నిలబెట్టుకోవడానికి తానే పెద్దన్న పాత్ర పోషించి మూడు పార్టీలను కలిపి తగ్గి నెగ్గాడు పవన్.

చేసిన త్యాగానికి, కట్టుబడిన మాటకు ప్రతిఫలంగా అటు టీడీపీ కూడా పవన్ విజయం కోసం సర్వ శక్తులు ఒడ్డింది. పిఠాపురంలో వర్మ అనే బలమైన టీడీపీ నాయకుడు ఉన్నప్పటికీ పవన్ కోసం ఆయన్ను ఒప్పించి తప్పించారు బాబు. ఇలా రెండు పార్టీల అధినేతలు చేసిన త్యాగాలకు పార్టీల నేతలు బలంగా నిలిచి కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే దాదాపు 70 వేలపైచిలుకు మెజారిటీతో తన రాజకీయ జీవితంలో మొదటి గెలుపును అందించిన పిఠాపురానికి నేడు పవన్ పయనమయ్యారు.

Also Read – చంద్రబాబుకి కొమ్మినేని పాఠాలు… జగన్‌కి చెప్పలేదేమి?

మొదటిసారిగా పిఠాపురం ఎమ్మెల్యే గా పిఠాపురంలో అడుగుపెట్టనున్నారు పవన్. తన గెలుపు కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత చెప్పడానికా.? లేక గెలుపు తరువాత పిఠాపురంలో టీడీపీ, జనసేనల మధ్య ఏర్పడిన చిన్న పాటి వివాదానికి సంధి కుదర్చడానికా.? అనేది తెలియాల్సి ఉంది. అయితే ఏది ఏమైనప్పటికి పవన్ పిఠాపురంలో వేసే ఈ తొలి అడుగే కూటమి బలాన్ని ప్రత్యర్థికి చాటిచెపుతోంది.

తన గెలుపు కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియచేస్తూనే ఇరు పార్టీల నేతలకు కలిసి అడుగు వేయాల్సిన ఆవశ్యకతను వివరించాలి. కూటమి లో ఏర్పడే చిన్న చిన్న విభేదాలను ఎప్పటికప్పుడు కట్ఠడి చేయకపోతే అదే కూటమిని బలహీన పరుస్తూ ప్రత్యర్థి బలాన్ని పెంచుతుంది. అవకాశం కోసం ఎదురుచూస్తున్న నీలి రంగు చూపులు అదును చూసి దెబ్బ కొట్టడానికి సిద్ధంగా ఉంటాయి అనేది ఇరు పార్టీల నేతలు గ్రహించాలి.

Also Read – సాక్షి : ‘క్షవరం’ అయినా ‘వివరం’ రాలేదే?

మూడు పార్టీలను, రెండు సామజిక వర్గాలను కలిపిన పవన్ త్యాగాన్ని, కష్టాన్ని చిన్న చిన్న అంశాల కోసం రోడ్డుకీడ్చడం అత్యంత హీనమైన చర్యగా భావించాలి. గెలుపు బలుపును కాదు బాధ్యతనిచ్చింది అన్న పవన్ వ్యాఖ్యలు ఎప్పటికి గుర్తుంచుకోవాలి. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ బాబు, పవన్ కు ఇస్తున్న గుర్తింపుని, ప్రాముఖ్యతను రెండు పార్టీల నేతలు గ్రహించాలి.

ఇలా బాబు, పవన్ ఒకరిఒకరై రాష్ట్ర సంక్షేమం కోసం చేయి చేయి పట్టుకుని ముందుకెళ్తుంటే ఇలా రెండు పార్టీల క్యాడర్ గిల్లికజ్జాలు పెట్టుకుని ప్రజలు కూటమి పార్టీ పై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసి మరోసారి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెడతారా.? అనేది ఆలోచించాలి. కూటమి బంధానికి బీటలు వేసే నాయకులను కట్టడి చేయాల్సిన బాధ్యత, వారి మధ్య సయోధ్య కుదర్చాల్సిన అవసరం అధినేతల మీదే ఉంటుంది.