
‘విలువలు – విశ్వసనీయత’ గురించి మాట్లాడాలంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు జగన్ మోహన్ రెడ్డి. నిజానికి ఆ పదాలకు, జగన్ కు ఎలాంటి సంబంధం లేకపోయినా, దానిని విరివిగా వినియోగించడంలో అందరి కంటే జగన్ ముందుంటారు. అలాంటి ‘విలువలు – విశ్వసనీయత’ మాటలు చెప్పే వారి గురించి, ఆచరణలో పాటించే వారి గురించి ఒక్కసారి గుర్తు చేసుకుందాం.
జనసేన అధినేతగా పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో పాటు, పార్టీని అన్ని స్థానాల్లో గెలిపించిన పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి మోడీతో చర్చలు జరిపి, నేరుగా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి అన్నయ్యకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. మెగా కుటుంబమంతా ఒకే దగ్గర నిలబడి పవన్ కళ్యాణ్ కు పూల వర్షంతో స్వాగతం పలికారు.
Also Read – దేవి…దుళ్లగొట్టేసాడుగా..!
విజయం సాధించిన తర్వాత విలువలకు కట్టుబడి కుటుంబంతో సంబరాలు చేసుకునే విధంగా పవన్ కళ్యాణ్ ఉంటే, 2019 ఎన్నికలలో తిరుగులేని విజయాన్ని సాధించిన తర్వాత, తన కుటుంబంలో మిగిలి ఉన్న తల్లి విజయమ్మను, చెల్లి షర్మిలను ఇంటి నుండి వెళ్లగొట్టిన ఘనత జగన్ మోహన్ రెడ్డి సొంతం. బహుశా ఇంతటి ఘనచరిత్ర ఎవరికీ లేదనుకోండి!
ఆస్తుల కోసం, అధికారం కోసం తండ్రి వైఎస్ నైనా, బాబాయ్ వివేకానైనా, తల్లినైనా, చెల్లినైనా ఏకరువు పెట్టిన చరిత్ర జగన్ మోహన్ రెడ్డిది. ఇలాంటి జగన్ మీడియా ముందుకు వస్తే చెప్పే మొదటి మాటే ‘విలువలు – విశ్వసనీయత.’ ఈ ఎన్నికల ముందు అయితే సోషల్ మీడియా ద్వారా షర్మిలను జగన్ పెట్టిన హింస తెలియనిది కాదు.
Also Read – వన్ నేషన్…వన్ ఎలక్షన్…వన్ పార్టీ.?
నేడు చిరంజీవి ఇంటి ముంగిట జరిపిన విజయోత్సవ సంబరాలతో అసలు కుటుంబ ‘విలువలు’ అంటే ఏమిటో పరోక్షంగా చెప్పకనే చెప్పారు. ఒక్క పవన్ కుటుంబం విషయమే కాదు, 2024 ఎన్నికలలో ఘనవిజయం సాధించిన తర్వాత చంద్రబాబు కుటుంబమంతా కూడా ఒకే దగ్గర ఉండి సంబరాలు చేసుకుంది.