‘తన పోరాటం వ్యక్తిగతం కాదు, సిద్ధాంతాల మీద’ అనే నినాదం పుచ్చుకున్న ‘జనసేన’ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఇప్పటివరకు చాలా విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే ఏదో ఒకటి, రెండు సందర్భాలలో తప్ప, తనపై వచ్చిన విమర్శలకు పవన్ పెద్దగా స్పందించింది లేదు. ఈ వ్యక్తిగత విమర్శలకు తానూ దూరం, తన రాజకీయ సిద్ధాంతాలు ఇవి కావని, ఇలాంటి రొటీన్ రాజకీయాలు చేయడానికి కాదు నేను వచ్చింది… అని వివిధ సందర్భాలలో చెప్పిన పవన్, చివరికి అలాంటి రొటీన్ రాజకీయ రోంపులో పడబోతున్నారా? ఏమో సంకేతాలు అయితే అలాగే కనపడుతున్నాయి.
ఏపీ బిజెపి అధికార ప్రతినిధి సిద్ధార్థ్ నాథ్ సింగ్ చేస్తున్న విమర్శలకు ప్రతిస్పందించిన పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా జవాబిచ్చారు. “రాజకీయాల్లో ఎంతో అనుభవం కలిగిన మీ పార్టీ ‘నోట్ల రద్దు’ వంటి ఘోర తప్పుడు నిర్ణయాన్ని ఎలా తీసుకుందో వివరించండి” అని పవన్ కల్యాణ్ సూటిగా ప్రశ్నించారు. ‘మీ నిర్ణయాల వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, మీ హిత బోధలు నాకు అవసరం లేదని, మీ బోధలేవైనా ఉంటే మీ పార్టీ వాళ్లకు చెప్పుకోండి’ అంటూ సిద్ధార్థ్ నాథ్ సింగ్ పై కాస్త గట్టిగానే స్పందించారు.
రాజకీయాల్లో విమర్శలు – ప్రతివిమర్శలు సహజమే. కానీ, పవన్ విమర్శలకు పెద్దగా స్పందించిన సందర్భాలు లేవు. ఒకవేళ స్పందించినా… నేడు ఎవరో ఏదో అన్న దానికి ఒక నెల రోజుల తర్వాతనో, ఏదో బహిరంగ సభలోనో సెటైర్లు వేసేవారు. కానీ, సిద్ధార్థ్ నాథ్ సింగ్ చేసిన విమర్శలకు మరుసటి రోజే కౌంటర్ ఎటాక్ చేయడం మాత్రం ఇదే మొదటిసారి. ఇలా చేయడం తప్పుగా భావించలేం. ఒక రకంగా పోలిటిక్స్ లో యాక్టివ్ గా ఉన్నారన్న సంకేతాలు కూడా పంపిన వారవుతారు. అయితే ‘ఇలా’ నేను చేయను అన్న పవన్ కూడా, చివరికి ‘అలాంటి’ రాజకీయ ఉచ్చులోనే బిగుసుకుంటున్నారా? అన్న సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి.