లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ పై…!

Pawan Kalyan wife Anna Lezhneva pregnantసరిగ్గా 24 గంటల క్రితం మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఓ వ్యక్తిగత సమాచారం వైరల్ అయిన విషయం తెలిసిందే. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కు మరియు మెగా తనయురాలు నిహారికకు వివాహం జరగబోతుందన్న వార్తను ప్రముఖ మీడియా సంస్థలు ప్రచురించడంతో, ఎంతో ప్రాధాన్యత దక్కింది. కానీ, ఈ వార్తలన్నీ ఒట్టి పుకార్లని మెగా హీరో సాయిధరమ్ తేజ్ స్పష్టం చేయడంతో, వీటికి శుభంకార్డు పడింది. అయితే ఇలా ఈ పుకార్లకు బ్రేక్ పడిందో లేదో గానీ, మరో ‘మెగా’ అంశం ప్రముఖ దినపత్రికలో ప్రచురితమై హాట్ టాపిక్ గా మారింది.

ADVERTISEMENT

అయితే ఈ సారి ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత అంశం కావడంతో దీనికి మరింత ప్రాధాన్యత దక్కింది. ఇప్పటికే మొత్తం ముగ్గురు సంతానం కలిగి ఉన్న పవర్ స్టార్ కు త్వరలో నాలుగవ సంతానం కలగనుందని ఈ వార్త సారాంశం. పవన్ రెండవ సతీమణి అయిన రేణుదేశాయ్ కు అకిరా, ఆధ్యాలు కలిగి ఉండగా, ప్రస్తుతం పవన్ తో పాటు ఉంటున్న అన్నా లేజనేవాకు పొలన అనే ఒక పాప ఉండగా, తాజాగా మరోసారి అన్నా ప్రేగ్నంట్ అయ్యిందనేది సదరు ఆంగ్ల దినపత్రిక కధనం.

అధికారికంగా ఈ విషయం వెల్లడి కానప్పటికీ, ఇటీవల ఓ మాల్ లో ‘బేబీ బంప్’తో కనిపించిందని, అలాగే కుటుంబ వర్గాల సన్నిహిత వర్గాలు కూడా ఈ విషయాన్ని రివీల్ చేశాయని తెలిపారు. దీంతో పవర్ స్టార్ అభిమానుల్లో ఈ వార్తపై ఆసక్తి పెరిగింది. ఇందులో వాస్తవం ఎంత? అన్న దానిపై ఆరా తీసే పనిలో ప్రస్తుతం పవన్ అభిమానులు నిమగ్నమై ఉన్నారు. ఒకవేళ ఈ వార్త నిజమైతే… సెంటిమెంట్ ప్రకారం… పవర్ స్టార్ కు వారసుడే అంటూ స్పందించే వారు కూడా లేకపోలేదు. నిహారిక అంశం మాదిరే ఇది వ్యక్తిగత సమాచారం కావడంతో… పవన్ తరపు నుండి సమాధానం వస్తుందో లేదో చూడాలి..!

ADVERTISEMENT
Latest Stories