కొన్ని రోజుల క్రితం ఆర్ఎక్స్ 100 తో సంచలనం సృష్టించిన పాయల్ రాజపుట్ నాగార్జున బంగార్రాజు సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ చెయ్యబోతుందని వార్తలు వచ్చాయి. అయితే ఆ వెంటనే తాను చెయ్యడం లేదని ఆమె చెప్పేసింది. తాజాగా ఆమెకు బిగ్ బాస్ షోలో పాల్గొనమని కూడా ఆఫర్ వచ్చిందని రెండు రోజుల నుండి వార్తలు వినిపించాయి.
తన ట్విట్టర్ అకౌంట్ లో పాయల్ రాజపుట్ అవన్నీ పుకార్లు అని త్రోసిపుచ్చాడు. తాను బిగ్ బాస్ 5 తెలుగులో భాగం కానని ఆమె చెప్పుకొచ్చింది. ఇలాంటి పుకార్లలోకి తనను లాగవద్దని ఆమె అభ్యర్థించింది. అయితే ఈ రెండు ఉదంతాలు బట్టి ఈ అమ్మడికి కొంచెం లౌక్యం తక్కువే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
పాయల్ కు ప్రస్తుతానికి ఆఫర్లు లేవు… ఈ సమయంలో ఏవో ఆఫర్లు వస్తున్నాయని వార్తలు రావడం మంచిదే కదా. నిజంగానే బిజీ హీరోయిన్ అనుకుని ఆమెకు మరిన్ని అవకాశాలు కూడా రావొచ్చు. పైగా ఈ రెండు ఆఫర్లలో తక్కువ స్థాయి ఆఫర్లు కాదు. వాటి పేరిట వార్తల్లో ఆమె పేరు నలిగితే మంచిదే కదా?
పాయల్ చివరి సారిగా గత ఏడాది జనవరిలో విడుదలైన రవితేజ డిస్కో రాజాలో కనిపించింది. లాక్ డౌన్ సమయంలో అనగనగా ఓ అతిధి అనే సినిమాలో నటించింది. ఆ కన్నడ రీమేక్ సినిమా ఆహా వీడియోలో (ఓటీటీలో) డైరెక్ట్ గా విడుదలైంది. ప్రస్తుతానికి ఆమెకు ఎటువంటి ఆఫర్లు లేవు.



