‘పెద్ది’కి రాకా రివ్యూ: ఇండస్ట్రీ నుండి ఇదే ఫస్ట్

Allu Arjun praises Peddi movie and appreciates Ram Charan, Janhvi Kapoor and the film's team

పెద్ది రిలీజై దాదాపు వారం కావస్తోంది. ప్రీమియర్ షోస్ నుంచి మిక్స్డ్ టాక్ రావడంతో ఇండస్ట్రీ హీరోలెవ్వరూ సినిమా గురించి కనీసం ట్వీట్ చేయలేదు. రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా లాంటి దర్శకులు కూడా సినిమా చూసి సైలెంట్ గా వెళ్లిపోయారు తప్ప ఒక్క మాట మాట్లాడలేదు. దాంతో టాలీవుడ్ నుండి పెద్దికి ఎలాంటి సపోర్ట్ లేనట్లేనని అనుకున్నారు.

కట్ చేస్తే.. ఇవాళ (జూన్ 09) అల్లు అర్జున్ “పెద్ది” సినిమాకి అదిరిపోయే రివ్యూ పోస్ట్ చేసాడు. ఆర్టిస్టులందర్నీ పేరుపేరునా అభినందించడమే కాకుండా.. దర్శకుడి ప్రతిభను కూడా కొనియాడాడు.

ADVERTISEMENT

ఈ దెబ్బతో చరణ్-అర్జున్ మధ్య ఎలాంటి గ్యాప్ లేదని క్లారిటీ రావడమే కాకుండా.. మెగా ఫ్యామిలీ అభిమానులందరూ మరోసారి ఏకమవ్వడం చెప్పుకోదగ్గ విషయం.

ఇక ఈ పోస్టులో బన్నీ స్పెసిఫిక్ గా జాన్విని మెన్షన్ చేయడం అనేది గమనార్హమైన విషయం. ఇప్పటివరకు ఆమె తిట్టినవాళ్లు ఉన్నారు తప్పితే.. ఆమెను పొగిడిన ఏకైక సెలబ్రిటీ బన్నీ మాత్రమే. ఇదే ఊపులో మరింత సినిమా సెలబ్రిటీలు కూడా సినిమాకి కాస్త పుష్ ఇస్తే.. వచ్చేవారం దాకా బిగ్ టికెట్ సినిమా లేదు కాబట్టి మాస్ ఆడియన్స్ కి ఈ సినిమా మరింత చేరువయ్యే అవకాశం పుష్కలంగా ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories