మహేష్ సినిమాలో నటించి అలా బయలుదేరాడు!

pelli-choopulu-comedian-priyadarshi‘పెళ్లిచూపులు’ సినిమాలో తన టైమింగ్ కామెడీతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ప్రియదర్శికి ఏకంగా ప్రిన్స్ మహేష్ బాబు సినిమాలో నటించే అవకాశం వచ్చిన విషయం తెలిసిందే. తెలుగు వర్షన్ కు గానూ మహేష్ స్నేహితుడుగా నటిస్తున్న ప్రియదర్శి, ప్రస్తుతం జరుగుతున్న చెన్నై షెడ్యూల్ లో పాల్గొన్నాడు. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా గురించి తాజాగా ఓ ట్వీట్ చేసాడు ప్రియదర్శి.

మహేష్ తో అద్భుతమైన సమయం గడిపానని, ఇంటికి వెళ్ళేందుకు ఎదురు చూస్తున్నానని, చెన్నై మెట్రోలో ఒక చిన్న ప్రయాణం బాగుందని, ఓ సెల్ఫీ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు ప్రియదర్శి. చూడడానికి పక్కింటి అబ్బాయి మాదిరి చాలా నాచురల్ గా కనపడే ప్రియదర్శికి గోల్డెన్ ఆపర్చునిటీ దక్కిందని ఈ సందర్భంగా టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories