Perni Nani Press Meet MLC Elections 2024

చంద్రబాబు నాయుడు ప్రజలని మాయ చేసి, ఈవీఎంలని మానిప్యులేట్ చేసి ఎన్నికలలో గెలిచారని జగన్‌ వాదించారు. నైవేద్యం పెట్టు నా మహిమ చూపిస్తానన్నట్లుగా బ్యాలెట్ పేపర్లలో ఎన్నికలు నిర్వహిస్తే మా తడాఖా చూపిస్తామని చెప్పుకున్నారు.

ఆయన కోరుకున్నట్లుగానే ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాలలో రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలకు బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు జరుగబోతున్నాయి.

Also Read – వర్మ సినిమాలకు జగన్‌ పెట్టుబడి: క్విడ్ ప్రోయే కదా?

కనుక తడాఖా చూపేందుకు గొప్ప అవకాశం వచ్చిన్నట్లే. కనుక ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల అభ్యర్ధిగా గౌతమ్ రెడ్డి పేరును ఖరారు చేశారు. నేడో రేపో మరో అభ్యర్ధి పేరుని ప్రకటిస్తారనుకుంటే, ఊహించని విదంగా ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని మాజీ మంత్రి పేర్ని నాని చేత చెప్పించేశారు!

ఎన్నికల నుంచి తప్పుకోవడానికి ఆయన ఏం కారణం చెప్పారంటే, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు నాయుడు ఖూనీ చేసేశారు కనుక ఈ ఎన్నికలు ధర్మబద్దంగా జరుగుతాయనే నమ్మకం లేకనే బహిష్కరిస్తున్నామని పేర్ని చెప్పారు.

Also Read – బీసీల పరిస్థితి మారలేదు కానీ.. కృష్ణయ్యది మారిందిగా!

ఈ పరిస్థితులలో ఎన్నికలను బహిష్కరించడమే మంచిదనే తమ అభిప్రాయాన్ని తమ అధినేత జగన్‌ గౌరవించి ఆమోదించారని పేర్ని నాని చెప్పారు. అంటే ఆయన పిరికితనాన్ని పేర్నినాని తన నెత్తిన వేసుకున్నారన్న మాట!

వైసీపి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ప్రతీ ఎన్నికలలో ఓడిపోతామని తెలిసి ఉన్నా టిడిపి ధైర్యంగా పాల్గొనేది. ఆ ఎన్నికలప్పుడు నామినేషన్ వేయడానికి వచ్చిన టిడిపి అభ్యర్ధులపై వైసీపి గూండాలు దాడిచేసి నామినేషన్ పత్రాలు లాక్కొని అక్కడి నుంచి తరిమికొట్టేవారు. అయినప్పటికీ అలాగే పాల్గొని టిడిపి మూడు ఎమ్మెల్సీ సీట్లను గెలుచుకుని జగన్‌కు షాక్ ఇచ్చింది కూడా.

Also Read – రెండూ సంక్రాంతి రిలీజ్ బొమ్మలే!

కానీ అప్పటి కంటే ఇప్పుడు పరిస్థితులు చాలా మెరుగుగా ఉన్నాయి. అయినా ఓటమి భయంతో ఎన్నికల నుంచి తప్పుకొని దానికీ ప్రభుత్వాన్ని, సిఎం చంద్రబాబు నాయుడుని నిందిస్తున్నారు.




రాష్ట్రంలో 40 శాతం మంది ప్రజలు తమవైపే ఉన్నారని జగన్‌ గొప్పగా చెప్పుకుంటారు. పైగా ఆయన కోరుకున్నట్లే ఈ ఎన్నికలు బ్యాలెట్ పేపర్లతోనే నిర్వహిస్తున్నారు కదా?కనుక ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్ధులను గెలిపించుకొని నిరూపించుకొని ఉంటే బాగుండేది కదా? కానీ ఇన్ని ప్రగల్భాలు పలికి తీరా ఎన్నికలు దగ్గర పడేసరికి తోక ముడుచుకొని పారిపోతే, ఉత్తర కుమార ప్రగల్భాలని జనం నవ్వుకోరా?