పిక్ టాక్ – జగన్ ముందు ఇలా ఉండాలబ్బాయ్!

pic-talk-ys-jagan-meetingకాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చి వైసీపీ ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్రంలోని చాలా మంది ముఖ్య నేతలు జగన్ ను అనుసరించిన విషయం తెలిసిందే. అయితే, ఎంత ఫాస్ట్ గా జగన్ పక్షాన చేరారో, అంతే ఫాస్ట్ గా మళ్ళీ వెనక్కి వచ్చేసిన సంగతులు రాజకీయ విజ్ఞులకు తెలిసిన విషయమే. మరికొందరు అయితే ఫస్ట్ మీటింగ్ లో జగన్ వ్యవహార తీరు నచ్చక ‘బూమ్ రాంగ్’ అయ్యారు.

మరి దీనంతటికి కారణం ఏమిటి? అంటే వైసీపీ నుండి మళ్ళీ వెనక్కి వచ్చిన నేతలందరూ చెప్పే ఒకే ఒక మాట… జగన్ వ్యవహార తీరు అని! కనీసం వయసుకు కూడా జగన్ గౌరవం ఇవ్వరని, పార్టీలో అభిప్రాయ సేకరణకు తావు లేదని, అంతా ఏకచ్ఛత్రాధిత్యంగా సాగుతుందని, పార్టీలో ఎంతటి వారైనా జగన్ ముందు చేతులు కట్టుకుని కూర్చోవాలని, అలాగే రాజకీయాల్లో ఏ స్థాయి అనుభవం ఉన్నా, జగన్ ను ‘సర్’ అని మాత్రమే పిలవాలని… ఇలా బయటకు వచ్చిన ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పుకొచ్చిన సంగతులు రాజకీయ విజ్ఞులకు తెలిసినవే.

ADVERTISEMENT

ఇవి కాక, పార్టీ అంతర్గతంగా మరియు పొలిటికల్ వర్గాల ద్వారా మరికొన్ని విషయాలు జగన్ వ్యవహార తీరు గురించి ప్రచారంలో ఉన్నాయి. అయితే తాజాగా వైసీపీ క్యాడర్ తో జగన్ సంప్రదింపులు జరుపుతున్న కొన్ని ఫోటోలను వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి. జగన్ నియంతృత్వానికి నిదర్శనంగా నిలుస్తుందని, జగన్ ముందు చేతులు కట్టుకుని కూర్చున్న ఓ నేత ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గతంలో జగన్ పై వెలువడిన అనేక ఆరోపణలు నిజమనిపించే విధంగా ఈ ఫోటో ఉండడం మరింత విశేషం. చేతులు కట్టుకుని కూర్చుని ఉన్న పార్టీ నేతలను చూసి, జగన్ మోములో చిరుదరహాసం తాండవించడం ఫోటోలో స్పష్టంగా కనపడుతోంది. అంటే ‘తన ముందు ఇలా ఉంటే… ఇక పార్టీలో మీకేమి ఇబ్బంది ఉండదు’ అనే సంకేతాలను జగన్ పంపుతున్నట్లుగా ఉందని నెటిజన్లు చేస్తున్న కామెంట్స్ కోకొల్లలు. అలాగే ఇతర ఫోటోలను కూడా వైసీపీ పోస్ట్ చేసినప్పటికీ, ఆ ఫోటోలలో జగన్ ఇంతలా చిరునవ్వు చిందించకపోవడం గమనించదగ్గ విషయమే!?

ADVERTISEMENT
Latest Stories