ఆపరేషన్ ఆకర్ష్ తో పరేషాన్ అవుతున్న వైసీపీకి కొత్త తలపోటు వచ్చిపడింది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం వైసీపీ ఆఫీసులో కొందరు కార్యకర్తలు పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కారు. పక్కా సమాచారంతో వైసీపీ ఆఫీసుకి వెళ్లిన పోలీసులకు దాదాపు పది మంది వ్యక్తులు పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 37 వేల రుపాయల నగదుతో పాటు సెల్ పోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అయితే, ఎన్నికల తర్వాత సదరు భవనాన్ని పార్టీ ఆఫీసుగా పెద్దగా వాడటం లేదని వైసీపీ వర్గాలు సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. అసలే పార్టీ దయనీయ పరిస్థితిలో ఉంటే, మరోవైపు ఇలాంటి కొత్త తలనొప్పులతో ప్రజలలో వైసీపీ అంటే మరింత చులకన భావన ఏర్పడుతోందని పార్టీ వర్గాలు మదన పడుతున్నారట. పరిస్థితి ఇలాగే కొనసాగితే వైసీపీ అంకం ముగిసే సమయం దగ్గరలోనే ఉందన్న విశ్లేషణలు వస్తున్నాయి.
ADVERTISEMENT
ADVERTISEMENT





