
సుమారు రెండున్నర దశాబ్ధాలపాటు తెలంగాణ రాజకీయాలను శాశించిన కేసీఆర్ దేశ రాజకీయాలను కూడా శాశించాలనుకున్నారు. కేసీఆర్‌ని కొట్టే మొనగాడు ఈ భూమ్మీద ఇంకా పుట్టలేదని ఆయనతో సహా బిఆర్ఎస్ నేతలందరూ గర్వంగా చెప్పుకునేవారు.
Also Read – కింగ్ అందుకుంటాడా.? శర్మ కొనసాగిస్తారా.?
కానీ కేసీఆర్‌ని ఒకసారి కాదు… వరుసగా రెండుసార్లు ఓడించి రేవంత్ రెడ్డి మొనగాడనిపించుకున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే కేసీఆర్ హయాంలో చేసిన అప్పులు, అవినీతి, అక్రమాలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలన్నీ తవ్వి తీస్తున్నారు. ఇవన్నీ కేసీఆర్ తల మీద వ్రేలాడుతున్న కత్తులవంటివే.
రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చివేస్తానని కేసీఆర్ బెదిరించినందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయకుండా ఉండరు. ఒకవేళ ఆయన కనికరించినా బీజేపీ కనికరించదు. ఒకవేళ బీజేపీ కూడా కనికరించినా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గోడ దూకేయకుండా ఉండరు.
Also Read – మూడు పార్టీల కథ…ముగ్గురి వ్యక్తుల వ్యధ..!
లోక్‌సభ ఎన్నికలకు ముందు మోడీ, ఎన్డీయే గురించి కేసీఆర్ మాట్లాడిన వంకర మాటల కారణంగా ఇప్పుడు కూతురు కల్వకుంట్ల కవితకి తిహార్ జైలు నుంచి ఎప్పటికైనా విముక్తి లభిస్తుందా?అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
మరోపక్క కేసీఆర్ తీవ్రంగా ద్వేషించే బీజేపీ ఎంపీ బండి సంజయ్ కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి పదవి చేపట్టగా, ఈటల రాజేందర్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కాబోతుండటం కేసీఆర్ జీర్ణించుకోవడం కష్టమే. ఈటల రాజేందర్ పార్టీ పగ్గాలు చేపట్టగానే మొట్టమొదట బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలను బీజేపీలోకి ఆకర్షించేందుకు ప్రయత్నించడం ఖాయమే.
Also Read – జీఎస్టీ ఆదాయం తగ్గితే.. సిగ్గు పడాల్సింది బాబు కాదు.. జగనే!
సింగరేణి బొగ్గు గనుల ప్రయివేటీకరణ పేరుతో కేసీఆర్ రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తే ఫలించలేదు కానీ ఇప్పుడు తెలంగాణ బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖ మంత్రి అవడం కేసీఆర్‌కు మరో షాక్ అనే చెప్పాలి.
లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడం, కేంద్రంలో మళ్ళీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలనే కేసీఆర్ కలలు పగటి కలలుగా మిగిలిపోయాయి.
ఇదే సమయంలో కేసీఆర్ చాలా ద్వేషించే చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంలో, జాతీయ రాజకీయాలలో ప్రాధాన్యత పొందుతుండటం, మళ్ళీ ఏపీ ముఖ్యమంత్రి అవుతుండటం కూడా జీర్ణించుకోవడం చాలా కష్టమే.
గత ఏడాది జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కేసీఆర్ సాయపడతారనే ఆశతో ఆయన హెచ్‌డి కుమారస్వామి చుట్టూ తిరిగారు. కానీ కేసీఆర్ ఆయనకి హ్యాండివ్వడంతో ఆ ఎన్నికలలో ఓడిపోయారు. అదే కుమార స్వామి ఆ తర్వాత ఎన్డీయేలో చేరి ఇప్పుడు మోడీ ప్రభుత్వంలో భారీ పరిశ్రమల శాఖ మంత్రి పదవి చేపట్టడం కేసీఆర్‌కి చాలా అజీర్తి కలిగించే విషయమే.
చంద్రబాబు నాయుడు అటు ప్రధాని నరేంద్రమోడీతో, ఇటు తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డితో సత్ససంబంధాలు కలిగి ఉండటం కూడా కేసీఆర్ జీర్ణించుకోవడం కష్టమే.
కేసీఆర్ అహంకారంతో విర్రవీగినందుకే పదవీ, అధికారం కోల్పోవడమే కాకుండా ఇప్పుడు ఎటు చూసినా అందరూ శత్రువులే తప్ప ఒక్క మిత్రుడు కూడా లేకుండా పోయారు. ఉన్న ఒకే ఒక్క మిత్రుడు జగన్ ఇప్పుడు ఆయన కంటే దయనీయ స్థితిలో ఉన్నారిప్పుడు.