ఎంపీ గోరంట్ల షోలో ఉన్నది నేను కాదు

police-complaint-Gorantla-Madhav-Nude-Video-controversy మనిషన్నాక కసింత కళా పోషణ ఉండాలా లేకుంటే మనిషికి గొడ్డుకీ తేడా ఏముంటుంది? అనే ఓ పాత సినిమా డైలాగ్ స్పూర్తితో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో కాల్ చేస్తే అది మంత్రులు అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ మెడలకు కూడా చుట్టుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. గోరంట్ల వీడియో షోతో పాటు ‘గంట.. అరగంటా…’ అంటూ మాట్లాడిన మంత్రులు అంబటి, అవంతిల పాత రికార్డులు కూడా మళ్ళీ సోషల్ మీడియాలో ఉర్రూతలూగిస్తున్నాయి. వాటిని చూస్తే జనం మరిచిపోయినా మీడియా మరిచిపోదు. సోషల్ మీడియా అసలే మరిచిపోనీయదు అనిపిస్తుంది. ఏదైనా ఓ విషయం హైలైట్ చేయాలనుకొన్నప్పుడు అటువంటి పాత రిఫరెన్సులు కోట్ చేస్తుండటం సహజమే. కనుక మున్ముందు ఇటువంటి వ్యవహారం ఏది బయటకి పొక్కినా వాటితో పాటు ఈ పాత రికార్డులు కూడా మళ్ళీ మళ్ళీ బయటకు వస్తూనే ఉండవచ్చు. కనుక “ఎంత పనిచేశావు గోరంట్లా…” అని అంబటి, గోరంట్ల తిట్టుకోకుండా ఉండరు.

గోరంట్ల షోలో కనిపించిన ఓ మహిళ కూడా కనిపించింది. కనుక ఆమె పరువు కూడా సోషల్ మీడియాలో పడింది. దాంతో ఆమె అనంతపురంలోని గాండ్లపెంట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. “ఆ వీడియోలో ఉన్నది నేను కాదు. కానీ నా ఫోటో, పేరు జోడించి గోరంట్ల షోలో ఉన్నది నేనే అంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ వీడియోను తొలుత మాలతీ రెడ్డి అనే మహిళ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత దానిని వేణు, చందు, రమణ నవీన్ కుమార్‌ అనే నలుగురు వ్యక్తులు ఫార్వర్డ్ చేశారు. నా వ్యక్తిగత జీవితానికి మచ్చ తెస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని” ఆమె పోలీసులను కోరారు.

ADVERTISEMENT

ఆమె పిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేసుకొన్నామని గాండ్లపెంట సీఐ శంకర్ నాయక్ చెప్పారు. దర్యాప్తులో ఆమె ఆరోపణలు నిజమని తేలితే తప్పకుండా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొంటామని చెప్పారు.

ఎంపీ గోరంట్ల మాధవ్ షో జరిగి నాలుగు రోజులవుతున్నా ఇంత వరకు జగన్ ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకోలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తుండటంపై మంత్రి ఆర్‌కె. రోజా స్పందిస్తూ “ఎంపీ గోరంట్ల తాను ఎటువంటి తప్పు చేయలేదని చెపుతున్నారు. స్వయంగా ఎస్పీకి ఫిర్యాదు చేసారు. దీనిపై పోలీసులు విచారణ జరిపి నిజానిజాలు నిర్ధారించిన తర్వాత ఒకవేళ గోరంట్ల తప్పు చేసినట్లు తేలితే సిఎం జగన్మోహన్ రెడ్డి తగిన చర్యలు తీసుకొంటారు,” అని చెప్పారు.

ADVERTISEMENT
Latest Stories