హీరోయిన్ జ్యోతికపై పోలీసులకు ఫిర్యాదు!

police Complaint register on joythika for Naachiyaar movie dialoguesతమిళ స్టార్ హీరో సూర్య సతీమణి, ఒకప్పటి టాప్ హీరోయిన్ జ్యోతికపై హిందూ మక్కళ్ కట్చి నేతలు చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. బాలా దర్శకత్వం వహించిన ‘నాచియార్’ చిత్రంలో జ్యోతిక ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రంలోని కొన్ని సంభాషణలపై ఇంతకుముందే వివాదం చెలరేగింది. పలు సంఘాలు చేపట్టిన నిరసనలతో… ఆ సన్నివేశాల్లోని సంభాషణలను చిత్ర యూనిట్ బీప్ చేసింది. ఈ సినిమా ఈ శుక్రవారం నాడు విడుదల అయింది.

ADVERTISEMENT

అయితే, ఈ సినిమాలో ఓ సన్నివేశంలో ‘మాకు ఆలయాలైనా, చెత్తకుప్పలైనా ఒక్కటే’ అనే డైలాగ్ ఉంది. జ్యోతికకు చెందిన ఈ డైలాగ్ పై హిందూ మక్కళ్ కట్చి నేతలు మండిపడ్డారు. ఈ సంభాషణలు హిందూ దేవాలయాలను, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు సంభాషణలను వెంటనే తొలగించాలని… జ్యోతిక, దర్శకుడు బాలాపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

ADVERTISEMENT
Latest Stories