jagan-sharmila

మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ కిందపడ్డ పై చెయ్యి నాదే అన్నట్టుగా వ్యవహరిస్తుండడంతో సర్వత్రా విమర్శలు ఎదుర్కుంటున్నారు. చేతిలో ఐదేళ్ళు అధికారం ఉంచుకుని ఇంకా గతంలో టీడీపీ నేతలు ఇలా చేసారు, అలా చేసారు అంటూ కాకమ్మ కబుర్లు చెప్పుకుంటున్నారు.

అలాగే గత టీడీపీ ప్రభుత్వంలో తన చెల్లి షర్మిల మీద సోషల్ మీడియాలో జరిగిన విష ప్రచారానికి టీడీపీ పార్టీకి సంబంధం ఉందంటూ, ఈ విష ప్రచారానికి బాలకృష్ణ కు లింక్ పెడుతూ చెల్లి షర్మిల మీద వల్లమానిన ప్రేమ కురిపిస్తున్నారు జగన్. అయితే జగన్ కు తన మీద ఉంది ప్రేమో, రాజకీయ అవసరమో గ్రహించిన షర్మిల మాత్రం జగన్ మాయ మాటలకూ తగ్గేదెలా అన్నట్టుగా అన్నకు గట్టి కౌంటర్లు ఇస్తూనే వస్తున్నారు.

Also Read – కన్నప్ప తీయడం కూడా శివలీలే!

అయితే జగన్ చేసిన వ్యాఖ్యలకు తన లాజిక్ ను జోడించి అన్నకు యిట్టె చెక్ పెట్టింది. గత టీడీపీ హయాంలో అంటున్నారు ఆ తరువాత ఐదేళ్లు అధికారంలో ఉంది వైసీపీ ప్రభుత్వమే కదా, అప్పుడు మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కదా, మరి అప్పుడెందుకు మీరు టీడీపీ పార్టీ మీద, అందుకు సంబంధించిన బాలకృష్ణ మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు.

ఇప్పుడు ఈ చెల్లి మీద అంత ప్రేమ చూపిస్తున్న మీరు అధికారం చేతిలో ఉన్న ఐదేళ్లు గుడ్డి గుర్రానికి పళ్ళు తోమారా.? అంటూ జగన్ పైన తీవ్రమైన విమర్శలు చేసారు. అయితే ఇప్పుడు షర్మిల చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాల్లో వైరల్ అవుతున్నాయి. అలాగే ఆమె చేసిన వ్యాఖ్యలలో వాస్తవం కళ్ళ కనిపిస్తుండడంతో షర్మిలతో రాజకీయ ఆట అంటే జగన్ కు చెలగాటమే అవుతుంది.

Also Read – విజయసాయీ ఏమిటీ నస?

ఇక అక్కడితో కూడా షర్మిల ఆగలేదు, అప్పుడు వారు ప్రచారం చేసారు అని ఆరోపిస్తున్న మీరు మీ ప్రభుత్వంలో మీ సైతాన్ సైన్యం ప్రభాస్ కు నాకు సంబంధం ఉంది అంటూ, నాకు క్యారెక్టర్ లేదని వైసీపీ సోషల్ మీడియాలో ప్రోపకాండ చేసిన మాట వాస్తవం కాదా.? అంటూ వైసీపీ సోషల్ మీడియా వికృతాలను మరో సారి చర్చకు తెచ్చారు.

జగన్ చెపుతున్నట్టు నిజంగా షర్మిల, ప్రభాస్ ల గాసిప్స్ ల ప్రచారంలో టీడీపీ పార్టీ ప్రోద్బలం ఉండి ఉంటే దాన్ని వైసీపీ సర్కార్ చూసి చూడకుండా వదిలేసిందా.? అంటే సొంత చెల్లి మీద తప్పుడు రాతలు రాశారు అని ఆరోపించిన వారి పై జగన్ ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారా.?

Also Read – వర్మగారి త్యాగాలకు ఇదా బహుమతి?

తన మీద టీడీపీ నేతలు రాజకీయ విమర్శలు చేసిన సహించని జగన్, దానికి పర్యవసానంగా టీడీపీ పార్టీ కార్యాలయాల మీద దాడులను ప్రోత్సహించి, టీడీపీ నేతల మీద కేసులు పెట్టి అరెస్టులు చేసిన ఈయన గారు సొంత చెల్లి వ్యక్తిగత జీవితం పై విష ప్రచారం చేస్తున్న వారిని వదిలిపెట్టారా.?

దీని బట్టి జగన్ కు షర్మిల మీద ఏ పాటి ప్రేమ ఉందో యిట్టె అర్ధమవుతుంది. అప్పుడు తన పై జరిగిన ఈ తప్పుడు ప్రచారానికి టీడీపీ కి సంబంధం ఉంది అని జగన్ ఒప్పుకుంటే షర్మిలకు అన్యాయం చేసిన మొదటి వ్యక్తి జగన్ నే అవుతారు. లేదు టీడీపీ నేతలకు ఆ ప్రచారానికి ఎటువంటి సంబంధం లేదు అని నిర్దారిస్తే జగన్ చేసేవి అన్ని ఫేక్ ప్రచారాలే, తప్పుడు వార్తలే అనేది స్పష్టమవుతుంది.




ఇందులో ఏఒక్కటి నిజమైన జగన్ షర్మిల ముందు దోషిగా నిలబడినట్టే. అలాగే తల్లి, చెల్లిని కూడా తన రాజకీయ అవసరాలకు వాడుకున్నందుకు జగన్ సమాజం ముందు తలదించాల్సిందే. ఏదిఏమైనా జగన్ ను మద్దెల దరువు మాదిరి వాయిస్తున్నారు షర్మిల.