‘మహర్షి’ హీరోయిన్ మండిపడింది!

Pooja Hegde  complaints on british airways racismబ్రిటిష్ ఎయిర్ వేస్ సిబ్బంది మరోసారి భారతీయులపై జాతి వివక్షను ప్రదర్శించారు. విమానంలో గ్లాస్ నీళ్లు కోరగా, రెండు గంటల పాటు ఇవ్వలేదు. అయితే పక్కనే ఉన్న మరో విదేశీయుడికి మాత్రం గ్లాసులకు గ్లాసులు మద్యం అందించారు. ఈ విషయాన్ని ‘మహర్షి, అరవింద సమేత’ చిత్రాల ఫేం పూజా హెగ్డే తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. తన స్నేహితుడితో బ్రిటిష్ ఎయిర్ వేస్ సిబ్బంది అమర్యాదకరంగా వ్యవహరించారని మండిపడింది.

ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో వెల్లడించని పూజా… “వావ్..! నిన్న రాత్రి బ్రిటిష్ ఎయిర్ వేస్ లో సిబ్బంది తన పట్ల ఎంత జాతి వివక్షను ప్రదర్శించారో నా స్నేహితుడు చెప్పాడు. అతను కేవలం గ్లాస్ మంచి నీళ్లు అడిగితే ఇవ్వకుండా రెండు గంటలు వెయిట్ చేయించారు. కానీ పక్కనే ఉన్న మరో విదేశీయుడికి గ్యాప్ లేకుండా మద్యం సప్లై చేశారు. బ్రిటిష్ ఎయిర్ వేస్ సిబ్బంది అసహ్యకరంగా ప్రవర్తించారు” అని పూజ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ADVERTISEMENT

[m9adh]

ADVERTISEMENT
Latest Stories