“రంగస్థలం”లో స్పెషల్ అట్రాక్షన్!

Pooja Hegde Item Song in Ram Charan Rangasthalam movieసుకుమార్ దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న “రంగస్థలం” సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ కెరీర్ లోనే అద్భుతమైన పాత్రగా కొనియాడుతున్న ఈ సినిమా చాలా బాగా వస్తోందన్న టాక్ హల్చల్ చేస్తోంది. చెర్రీ సరసన మొదటిసారిగా సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఇప్పటికే బుల్లితెర సెన్సేషన్ అనసూయ ఓ కీలకపాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ADVERTISEMENT

అయితే తాజాగా ఈ సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్ తోడయ్యిందన్న వార్త ట్రేడ్ వర్గాలలో హల్చల్ చేస్తోంది. వరుణ్ తేజ్, బన్నీల సరసన నటించిన పూజా హెగ్డే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో రామ్ చరణ్ తో కలిసి స్టెప్పులు వేయనుందన్న సమాచారం మెగా ఫ్యాన్స్ ను ఊర్రూతలూగిస్తోంది. డ్యాన్స్ లు వేయడంలో పూజా నేర్పరి కావడంతో, చెర్రీకి ధీటుగా కాలు కదుపుతుందని చెప్పడంలో సందేహం లేదు. చిత్ర యూనిట్ అధికారికంగా డిక్లేర్ చేస్తే మెగా ఫ్యాన్స్ కు పండగే అన్న మాట!

ADVERTISEMENT
Latest Stories