తానూ ఫస్ట్ టైం హైదరాబాద్ కు వచ్చిన సమయంలో చాలా మంది హీరోల పోస్టర్లు చూశానని, అయితే మహేష్ బాబు కటౌట్ చూసిన తర్వాత… నేను లవ్ లో పడిపోయానని, అందుకే మహేష్ బాబుతో ఒక్క పాట అయినా గానీ ‘శ్రీమంతుడు’ సినిమాలో చేసానని చెప్పుకొచ్చింది హీరోయిన్ పూర్ణ. అయితే ఆ పాట చాలా సంప్రదాయబద్ధమైనది కావడం మరో స్పెషాలిటీ అని, ఈ పాట తర్వాత తనకు ఎన్నో ఆఫర్లు వచ్చాయని, అయితే వాటిని తానేమీ అంగీకరించలేదని తెలిపింది.
“జయమ్ము నిశ్చయమ్మురా” సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న పూర్ణ సదరు సంగతులన్నీ మీడియా వర్గీయులతో పంచుకుంది. తానూ నృత్య కళాకారిణి కావడంతో, తన డ్యాన్స్ లు ఐటెం నంబర్లకు పనికి రావని, తానూ కూడా అలాంటి పాటలలో నర్తించడానికి ఒప్పుకోనని, ‘శ్రీమంతుడు’ సినిమా తర్వాత తనకు వచ్చిన పాటలు ఇలాంటి కోవలోకే చెందుతాయని, ఆయా పాటలలో ధరించాల్సిన కాస్ట్యూమ్స్ తదితర కారణాల వలన వాటినేమీ ఒప్పుకోలేదని వివరణ ఇచ్చింది ఈ ‘సీమటపాకాయ్’ భామ.



