అసలు కుల పెద్దలు వెళ్లారు….ఇప్పుడు మరో పెద్దన్న వచ్చాడు..!

Posani Krishna Murali

నిన్నమొన్నటి దాక జనసేన పార్టీ ఎవరికీ సీట్లు ఇవ్వాలి..ఎవరితో పొత్తు పెట్టుకోవాలి..ఏఏ స్థానాలలో పోటీ చెయ్యాలి…ఎన్నాళ్ళు ముఖ్యమంత్రి పదవి కోరుకోవాలి…వంటి రాజకీయ నిర్ణయాలను కూడా వారే ప్రభావితం చేసిన కాపు కుల పెద్దలుగా చెప్పుకునే కొంతమంది సీనియర్ రాజకీయ వేత్తలు ఒక్కక్కొరుగా తమ రూపాన్ని మార్చుకుంటూ వైసీపీ గూటికి చేరిపోయారు.

ఈ సారి రాజ్యాధికారంలో కాపు కులానికి పెద్ద పీట వేయాల్సిందే, టీడీపీ పార్టీ తో పొత్తులో జనసేన పార్టీకి పవన్ కు పవర్ షేరింగ్ రావాల్సిందే అంటూ హరిరామ జోగయ్య…, నా ఇంటికి వచ్చి నా ఆశీర్వచనాలు తీసుకుంటే నా దీవెనలు నీకు, నీ పార్టీకే…, తద్వారా కాపు నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు అంటూ ముద్రగడ…జనసేన పార్టీ పై పెత్తనం చేస్తూ కాపు సామజిక వర్గాన్ని రెచ్చగొట్టి మరో సామజిక వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధమయ్యారు.

ADVERTISEMENT

పవన్ కాపు ఓట్లను కమ్మ వారికీ తాకట్టు పెడుతున్నారు అంటూ మరో కుల పెద్ద మీడియా ముందుకు వచ్చారు. తానూ పుట్టింది కమ్మ సామజిక వర్గంలో అయినప్పటికీ రంగా గారికి అభిమానినని…, అటువంటి రంగా ను చంపింది చంద్రబాబు నాయుడే. అటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయడానికి పవన్ సిద్దపడాడ్డు అంటూ మరోసారి కాపు సామాజికవర్గాన్ని రెచ్చగోట్టడానికి మీడియా ముందుకు వచ్చారు మెంటల్ కృష్ణగా పాపులర్ అయినా పోసాని కృష్ణ.

ఇప్పటికి రంగా జీవించి ఉంటే ముఖ్యమంత్రి అయ్యేవారు అనుకుంటున్నా ఆ సామజిక వర్గానికి చెందిన వారికీ ఒక ఆశాకిరణంలా వచ్చారు పవన్. కానీ ఆయనేమో నన్ను కాదు, నాకు అంత సమర్థత లేదు బాబు ని సీఎం ని చేయండి అంటూ కాపు ఓట్లను బాబు కాళ్ళ దగ్గర పెడుతున్నారు అంటూ టీడీపీ – జనసేన రెండు పార్టీల పొత్తుని రెండు కులాలకు ఆపాదించి వైసీపీ విజయానికి బాటలు వేయాలని ప్రయత్నిస్తున్నారు పోసాని.

కులం చూసి ఓటేయండి…మతం చూసి ఓటడగండి…అంటూ రాజకీయాలు చేయాలనుకుంటే ఇలా మెంటల్ కృష్ణ గా మిగిలిపోవాల్సిందే అనేది పోసాని ఎప్పటికి గ్రహిస్తారో ఏమో..! ఒక సామజిక వర్గం పై విషం చిమ్మడానికి.., మరో సామజిక వర్గం వారిని అధికారంలోకి తీసుకురావడానికి ఇలా కాపు సామజిక వర్గాన్ని రెచ్చగొట్టడం వైసీపీ రాజకీయ వ్యూహంగా మారిపోయింది.

రంగా మీద అంత ప్రేమ ఉన్న ఈ పోసానికి వైసీపీ నేత గౌతమ్ రెడ్డి రంగా పై చేసిన హీనమైన విమర్శలు వినిపించలేదా..? లేక రంగా హత్యకు కారణమైన కుటుంబానికి జగన్ రాజకీయ అవకాశం కల్పించింది కనపడలేదా..? ఏకంగా రంగా కుమారుడు రాధను జగన్ పార్టీ నుండి బయటకు సాగనంపిన విషయం గుర్తులేదా..? ఇలా ఇంకెన్నాళ్లు తమ రాజకీయ అవసరాల కోసం రంగా పేరు వాడుకుని రెండు కులాల మధ్య చిచ్చు రగిలిస్తూ ఉంటారు.

రాజకీయాలలోకి వచ్చిన వ్యక్తి ఒక కులాన్ని అడ్డుపెట్టుకుని ఎదగాలని ఎప్పటికి అనుకోడు. అలా అనుకున్న వ్యక్తి ఎప్పటికి రాజకీయాలలో రాణించలేరు. అన్ని కులాలను సమాన దృష్టితో చూసిన వాడే నాయకుడవుతాడు. కులాన్ని అడ్డుపెట్టుకున్నవాడు కుల నాయకుడే కానీ ప్రజానాయకుడు కాలేడని ఇప్పటికే కులపెద్దలుగా చెప్పుకుంటున్న వారు నిరూపించారు.

ఇలా కులాలను రెచ్చగొట్టి రాజకీయ చేయాలి అనే వారి ఆలోచనలకూ టీడీపీ – జనసేన పార్టీల అధినేతలు ఎప్పుడో చెక్ పెట్టారు అనేది ముద్రగడ, జోగయ్య ఇక తమ వ్యూహాలు, ఎత్తుగడలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలకు కాలం చెల్లిందని గ్రహించి వారి నీలి రంగును బయటపెట్టారు. ఇక పోసానికి కూడా ఈ విషయం త్వరలోనే అర్ధమవుతుంది.

ADVERTISEMENT
Latest Stories