“సోగ్గాడు” ల్యాండ్ అయ్యాడు! బంగార్రాజు కుమ్మేసాడు!

positive-talk-for-soggade-chinni-nayanaఅక్కినేని నాగార్జున ద్విపాత్రాభినయంలో నటించిన సంక్రాంతి సినిమా “సోగ్గాడే చిన్నినాయనా” సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. శివాలయం గుడి నగల నేపధ్యంలో సాగే ఓ చిన్న కధను ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ విజయవంతం అయ్యారు.

ఈ సినిమాకు ప్రధాన హైలైట్ నాగార్జున పోషించిన ‘బంగార్రాజు’ పాత్ర. గోదావరి జిల్లా యాసతో నాగ్ వెండితెరపై విధ్వంసం సృష్టించాడు. ఈ సినిమాకు ‘హోల్ అండ్ సోల్’ బంగార్రాజు పాత్ర మాత్రమే. ‘మన్మధుడు’ ట్యాగ్ లైన్ ఉన్న నాగార్జునకు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే అయినప్పటికీ, తనదైన రీతిలో సరికొత్తగా తనను తానూ ఆవిష్కరించుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ‘బంగార్రాజు’ పాత్రలో మరో హీరోను ఊహించుకోవడానికి అవకాశం ఇవ్వకుండా ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నారు.

ADVERTISEMENT

సినిమాలో బ్రహ్మానందం వంటి టాప్ కమెడియన్ ఉన్నా, ‘బంగార్రాజు’ పాత్ర ద్వారా నాగ్ చేసిన ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకు వినోదాన్ని పంచిందంటే, నాగ్ ఏ రేంజ్ లో రెచ్చిపోయాడో అర్ధం చేసుకోవచ్చు. ఇదే సమయంలో ‘రాము’ పాత్ర ద్వారా కావాల్సినంత వేరియేషన్ చూపించారు. ఇక, అనూప్ రూబెన్స్ పాటలు, నేపధ్య సంగీతం ఆహ్లాదకరంగా ఆకట్టుకుంది. సంక్రాంతి పండగ సమయంలో సరైన వినోదాన్ని పంచిన సినిమాగా “సోగ్గాడు చిన్నినాయనా” ప్రేక్షకుల నుండి నీరాజనాలు అందుకుంటోంది.

ADVERTISEMENT
Latest Stories