
ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికలలో ఓడిపోయాక ఆ షాకు నుంచి తేరుకొని ఆత్మపరిశీలన చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. కనుక ఇంకా ఆ షాకులో ఉన్న వైసీపి ఓటమికి అసలు కారణాలు, ప్రజలకు చెప్పేందుకు వేరే కారణాలు కనుగొని చెప్పుకునేందుకు మరికొంత సమయం పట్టవచ్చు.
ముఖ్యంగా సైకో లక్షణాలు కలిగిన అధినేతకి ఈ సమయంలో ఎదుటపడేందుకు వైసీపి నేతలు ఎవరైనా జంకుతారు. కనుక ఆయన ప్రకోపం కూడా శాంతించిన తర్వాత వైసీపి పోస్టు మార్టం మొదలయ్యే అవకాశం ఉంది.
Also Read – బీజేపి విజయంలో చంద్రబాబు… కొందరికి ఎసిడిటీ తప్పదు!
అయితే ఈలోగా మాజీ గుడ్డు మంత్రి గుడివాడ అమర్నాథ్ నేడు మీడియా ముందుకు వచ్చి వైసీపి ఓటమికి మొదటి కారణం చెప్పారు. అది చాలా సహేతుకంగానే ఉంది కూడా.
ఆయన ఏమన్నారంటే, “జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు, అమలుచేసిన సంస్కరణలు, వ్యవస్థలలో తీసుకొచ్చిన మార్పులలో వైసీపి కార్యకర్తలను పట్టించుకోలేదేమో….? అని నాకు అనిపించింది. పార్టీ కార్యకర్తలకు ఇవ్వాల్సిన గౌరవం, ప్రాధాన్యత ఇవ్వలేదేమో….? అని నాకు అనిపించింది.
Also Read – జగన్‌కి విరుగుడు వారిద్దరే… ఏమవుతుందో?
మంత్రిగా పనిచేసినప్పుడు, ఇటీవల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు నేను ఇది గమనించాను. మా ఓటమికి ఇది కూడా ఓ కారణమని వ్యక్తిగతంగా నేను భావిస్తున్నాను,” అని అన్నారు.
తాను మంత్రిగా ఉన్నప్పుడే ఇది గమనించానని గుడివాడ అమర్నాథ్ ఎన్నికలలో వైసీపి ఓడిపోయిన తర్వాత ఇప్పుడు తాపీగా చెపుతున్నారు. అప్పుడే తమ అధినేత జగన్ ఈ ముక్క ఎందుకు చెప్పలేదు? అంటే పిల్లి మెడలో గంట ఎవరు కడతారు?అని సర్ది చెప్పుకోవలసి ఉంటుంది.
Also Read – వివేకా హత్యతో సంబందం లేకపోతే భయం దేనికి?
కానీ పార్టీలో కార్యకర్తల స్థానంలో వాలంటీర్లను ప్రవేశపెట్టడం తప్పని గుడివాడ అమర్నాథ్ ఇప్పుడు చల్లగా చెపుతున్నట్లు భావించవచ్చు. ఇది చాలా పెద్ద తప్పని నిరూపితం అయ్యింది కూడా.
జగన్ వాలంటీర్లను ప్రవేశపెట్టడం ద్వారా వైసీపి కార్యకర్తలకు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరికీ సామాన్య ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు తెంచేశారని చెప్పవచ్చు. వైసీపి ఓటమికి కారణాలలో ఇది కూడా ఒకటి అని గుడివాడే ఇప్పుడు చెపుతున్నారు కదా?
అయితే వాలంటీర్ల విషయంలో జగన్ ఒకటనుకుంటే ఎన్నికల సమయంలో మరొకటి జరిగింది. వారిని ఎన్నికలలో వాడేసుకుందామని జగన్ అనుకుంటే, ఈసీ వారిని ఎన్నికల ప్రక్రియకు, పింఛన్ల సొమ్ము పంపిణీకి దూరంగా ఉండాలని ఆదేశించింది.
దీంతో కీలకమైన ఎన్నికలకు ముందు వైసీపికి ఎంత నష్టం జరిగిందో, దానిని అధిగమించడానికి జగన్, వైసీపి నేతలు వారి సాక్షి మీడియా చంద్రబాబు నాయుడుని ఎంతగా నిందించారో అందరూ చూశారు.
అదే… మొదటి నుంచి వైసీపి కార్యకర్తలను ఉపయోగించుకొని ఉండి ఉంటే ఎన్నికల సమయంలో ఇటువంటి సమస్యలు తలెత్తేవే కావు కదా?
కానీ జగన్ తమని కాదని వాలంటీర్లకు ప్రాధాన్యం ఇవ్వడంతో వైసీపి కార్యకర్తలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు అందరూ చాలా నొచ్చుకున్నారు కూడా.
వాలంటీర్లతో ఎన్నికలు గెలవవచ్చనే వెర్రి ఆలోచన, పిచ్చి నిర్ణయంతో జగన్ వైసీపిని ఫ్యానుకి ఉరి వేసి చంపేశారు. కనుక ఈ రాజకీయ హత్యపై ఇప్పుడు పోస్ట్ మార్టం చాలా అవసరమే కానీ… దాని వలన ఉపయోగం ఉండదు.