ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఏమి చెపుతోందంటే…

postal-ballot

నేటితో ఎన్నికల ప్రచారం ముగియబోతోంది. సోమవారం పోలింగ్‌ జరుగబోతోంది. ఇప్పటికే వృద్ధులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే ఎన్నికల విధులలో పాల్గొంటున్న ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు, అధికారులు కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ తీర్పు చెప్పేశారు.

ADVERTISEMENT

రాష్ట్రంలో వృద్ధులకు వాలంటీర్ల ద్వారా పింఛన్ అందజేస్తున్నందున వారిలో కనీసం 50-60 శాతం మంది అయినా వైసీపికే ఓట్లు వేసి ఉండవచ్చు. కానీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు వేసిన వారందరూ జగన్‌ ప్రభుత్వం బాధితులే. కనుక ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులలో 90 శాతం పైగా కూటమికే ఓట్లు వేస్తారు. మిగిలిన 10 శాతంలో క్రీస్టియన్, రెడ్డి, దళిత సామాజికవర్గాలకు చెందినవారు వైసీపికే ఓట్లు వేసి ఉండవచ్చు.

ప్రభుత్వోద్యోగులు: జీపీఎఫ్ సొమ్ముని జగన్‌ ప్రభుత్వం వాడేసుకోవడం, సిపిఎస్ రద్దు చేస్తామని మోసగించడం, డీఏ బకాయిలు చెల్లించకపోవడం, పదవీ విరమణ చేసినవారికి చెల్లించాల్సిన సొమ్ము చెల్లింపులో ఆలస్యం, పెన్షనర్లకు పెన్షన్ చెల్లింపులో ఆలస్యం జరుగుతుండటం, వేతన సవరణ ఇంకా సెలవులు, పదోన్నతులు, బదిలీలు వంటి అనేక ఇతర సమస్యల కారణంగా ప్రభుత్వోద్యోగులు జగన్‌ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

ఉపాధ్యాయులు: జగన్‌ ప్రభుత్వం ఈ 5 ఏళ్ళలో ఉపాధ్యాయులతో ఓ ఆట ఆడుకుంది. ముఖ్యంగా విద్యాశాఖ ప్రవీణ్ ప్రకాష్ డీఈవో, స్కూల్ హెడ్ మాసర్స్, ఉపాధ్యాయుల పట్ల చాలా అవమానకరంగా వ్యవహరించారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా వారి పట్ల చాలా చులకనగా మాట్లాడారు. రాష్ట్రంలో ఉపాధ్యాయులను ఇదివరకు ఏ ప్రభుత్వమూ ఇంతగా వేధించలేదు.

కనుక గత ఎన్నికలలో జగన్‌ని గెలిపించిన తామే ఈ ఎన్నికలలో ఓడించబోతున్నామని వారు చాలా కాలం నుంచే చెపుతున్నారు. ఈ భయంతోనే ఉపాధ్యాయులకు ఎన్నికల విధులు అప్పగించకుండా పక్కన పెట్టాలని జగన్‌ ప్రభుత్వం ప్రయత్నించింది కూడా. కానీ ఎన్నికల సంఘం అందుకు అంగీకరించలేదు. కనుక వారందరూ వైసకి వ్యతిరేకంగా ఓట్లు వేశారని భావించవచ్చు.

ఈసారి కనీసం 115-120 సీట్లు గెలుచుకుంటామని చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ నమ్మకంగా చెపుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయుల ఓట్లన్నీ కూటమికి పడటం ఖాయమే. కనుక వారి ఓట్ల ద్వారా కూటమికి మరో 15-20 ఎమ్మెల్యే సీట్లు కలుస్తాయనుకుంటే కూటమికి 130కి పైనే సీట్లు వచ్చే అవకాశం ఉంది.

ADVERTISEMENT
Latest Stories