‘డార్లింగ్’ సినిమాలో ప్రేక్షకులకు కన్నులవిందు చేసిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – స్వీటీ అనుష్కల జంట “బాహుబలి 2”తో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ‘అమరేంద్ర బాహుబలి’గా ప్రభాస్ – ‘దేవసేన’గా అనుష్కల జంట చూడముచ్చటగా ఉండడంతో వీరిద్దరికీ సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే త్వరలో ప్రభాస్ మరియు అనుష్కలు కూడా తమ తమ జీవితాలకు భాగస్వామ్యులను వెతుక్కునే పనిలో ఉన్నారనే సమాచారంతో… ఏకంగా వీరిద్దరిని కలిపేసే కార్యక్రమానికి నెటిజన్లు శ్రీకారం చుట్టినట్లున్నారు.
‘బాహుబలి 2’ సినిమా విడుదలకు ముందు అమెరికాలో ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం వెళ్ళిన సందర్భంలో స్థానిక మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చిన సమయంలో ప్రభాస్ మాట్లాడుతుండగా, పక్కనే ఉన్న అనుష్క తదేకంగా ప్రభాస్ ను చూస్తూ ప్రేమాభావపు హావభావాలను పలికించింది. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందన్న రీతిలో ఈ వీడియోలో ప్రభాస్ మాట్లాడుతున్న మాటలను ఎడిట్ చేస్తూ… బ్యాక్ గ్రౌండ్ లో ఓ ప్రేమ పాటను వేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
అయితే ఆ వీడియోలో ప్రభాస్ ‘బాహుబలి పార్ట్ 1 ఘనవిజయం గురించి, అలాగే పార్ట్ 2 గురించి క్లుప్తంగా మాట్లాడారు. ప్రభాస్ మాట్లాడిన తర్వాత స్వీటీ అనుష్క కూడా సినిమా గురించి ప్రసంగించగా, వీరిద్దరి పక్కనే ఉన్న రానా కూడా మాట్లాడారు. నిజానికి ఇది సినిమా విడుదలకు ముందు చిత్రీకరించిన వీడియో కాగా, ‘బాహుబలి 2’ ఘనవిజయం సాధించడంతో పాటు, సినిమాలో ఈ జంట అద్భుతంగా ఉండడంతో ఈ వీడియో లేటెస్ట్ సర్క్యూలేట్ అవుతూ సందడి చేస్తోంది.
Real Video



