వంగవీటి రాధ బర్త్ డే గిఫ్ట్ లోడింగ్..?

Vijayawada Mayor Poll: Vangaveeti Radha Faces Key Contest

ఏపీ వ్యాప్తంగా జరిగిన స్థానిక ఎన్నికల సమరంలో రాజకీయాలకు అత్యంత కేంద్ర బిందువుగా ఉండే విజయవాడ మేయర్ పీఠంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అందరి దృష్టి ఇప్పుడు విజయవాడ మేయర్ సీటు పైనే ఉంది.

కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన వంగవీటి రాధాకృష్ణకు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారాయి. గత కొన్నేళ్లుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న వంగవీటి రాధ, విజయవాడలో అసలు రాజకీయ ఉనికే లేని జనసేన విజయవాడ మేయర్ సీట్ కి బరిలోకి దిగడంతో విజయవాడ మేయర్ స్థానం మీద ఈ స్థాయి ఉత్కంఠ నెలకొంది.

ADVERTISEMENT

ఇటు వైసీపీ అభ్యర్థిగా రాయన భాగ్యలక్ష్మి, స్వతంత్ర అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు బరిలోకి దిగారు. విజయవాడ కుల సమీకరణాల నేపథ్యంలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా ఆసక్తికరంగా మారింది.

ఈ నేపథ్యంలో నేడు ఫలితాల ప్రకటన కావడం దానికి తోడు వంగవీటి రాధ పుట్టినరోజు కూడా ఇదే కావడంతో వంగవీటి రాధ బర్త్ డే గిఫ్ట్ లోడింగ్ కాబోతుందా అన్న ప్రచారం ఊపందుకుంది. అయితే కూటమి అభ్యర్థిగా వంగవీటి రాధ పేరు తెరమీదకు రావడమే ఒకరకంగా జనసేన విజయాన్ని సూచించిందనే చెప్పాలి.

తండ్రి వంగవీటి మోహనరంగా రాజకీయ వారసత్వానికి తన విజయంతో మరింత బలం చేకూర్చాలని రాధా భావిస్తున్నారు. మరి విజయవాడ ప్రజలు రాధాకు బర్త్‌డే గిఫ్ట్ ఇస్తారా? మేయర్ పీఠం ఆయనను వరిస్తుందా? అన్నది ఫలితాలతో తేలనుంది. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వంగవీటి రాధ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసారు.

ADVERTISEMENT
Latest Stories